Thursday, February 5, 2009

నా నిరీక్షణ -- నీకోసం

వెన్నెల పంచే వాడొస్తాడని, తన చాయలు వెదుకుతు దరికొస్తాడని,
మురుగు గుంటలో మెలికలు తిరిగిన
కలువ పువ్వులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

బీటలు వారిని నోటిని తెరిచీ, మోరని ఎత్తి నింగిని చూస్తూ
సుధలను నింపే మబ్బులకోసం, కంటి నీటినీ గాలికొదిలిన
బీడు భూమిలా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

తాదాత్మ్యత చెంది, తరుణము ఎరగక తలకిందులుగా తపస్సు చేస్తూ
తను ఎప్పటికీ జారనను కునే చూరు మీద చేరిన
వాన చినుకులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

vennela pancE vaaDostaaDani, tana chaayalu vedukutu darikostaaDani,
murugu gunTalO melikalu tirigina
kaluva puvvulaa undi naa niriikshaNa -- niikOsam

biiTalu vaarini nOTini tericii, mOrani etti ningini cuustuu
sudhalanu nimpE mabbulakOsam, kanTi niiTinii gaalikodilina
biiDu bhuumilaa undi naa niriikshaNa -- niikOsam

taadaatmyata cendi, taruNamu eragaka talakindulugaa tapassu cEstuu
tanu eppaTikii jaarananu kunE cuuru miida cErina
vaana cinukulaa undi naa niriikshaNa -- niikOsam

3 comments:

  1. "తను ఎప్పటికీ జారనను కునే చూరు మీద చేరిన
    వాన చినుకులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం"
    ఈ పదాలు నాకు నచ్చాయి..బాగుంది..
    ఒక సూచన..
    తెలుగు కవితకి ,కింద ఉన్న ఆంగ్ల కవితకి మధ్యన ఒక గీత(line) ఉంచండి. తెలుసుకొవడానికి వీలుగా ఉంటుంది.
    Hope u dont mind it.Thank u.
    All the best!

    ReplyDelete
  2. మాధవ్ గారు తప్పకుండా మీ సలహాను పాటిస్తాను. ఇందులో అనుకునేదేముందండి. మీరు మరీనూ..

    ReplyDelete