Friday, February 6, 2009

కాలంతో కసరత్తు

ఆకాలమేలరా ననుజేర రాదూ
ఆనాటి ఆనవ్వు తిరిగేల రాదూ

పగలంత ముసుగేసి సాయాలు లేచినా
రాత్రేమొ రాకుండ ఉందేమొ చూసినా
ఈ రాత్రి కాపేసి భారంగ తూలినా
తెల్లార బోదంటు ఆశగా చూసినా ! ... ఆకాలమేలరా

నేనీడ భోరంటు శోకాలు పెట్టినా
టెంకాయ నీకంటు లంచాలు చూపినా
పెద్దగా గొంతెత్తి బెదిరించి చూసినా
వేనోళ్ళ కాలాన్ని ప్రార్ధించి చూసినా ! .. ఆకాలమేలరా

ఈ చేతి గడియారమాచేతికెట్టినా
తీసేసి కొన్నాళ్ళు పారేసిచూసినా
గోడమీదన దాన్ని తిరగేసి ఉంచినా
లోనున్న ఆసెల్లు పీకేసి చూసినా ! ... ఆకాలమేలరా

సామ దాన బేధ దండాలు వాడినా
పారిపోయిన ఘడియ గీతాలు పాడినా
ఆకాలమేమైన ఈదరిదాపు రాలేదు
ఉన్న కాలము కూడ చూస్తుండగా బాయె ! .. ఆకాలమేలరా


aakaalamElaraa nanujEra raaduu
aanaaTi aanavvu tirigEla raaduu

pagalanta musugEsi saayaalu lEcinaa
raatrEmo raakunDa undEmo cuusinaa
ii raatri kaapEsi bhaaramga tuulinaa
tellaara bOdanTu aaSagaa cuusinaa ! ... aakaalamElaraa

nEniiDa bhOranTu SOkaalu peTTinaa
Tenkaaya niikanTu lancaalu cuupinaa
peddagaa gontetti bedirinci cuusinaa
vEnOLLa kaalaanni praardhinci cuusinaa ! .. aakaalamElaraa

ii cEti gaDiyaaramaacEtikeTTinaa
tiisEsi konnaaLLu paarEsicuusinaa
gODamiidana daanni tiragEsi uncinaa
lOnunna aasellu piikEsi cuusinaa ! ... aakaalamElaraa

saama daana bEdha danDaalu vaaDinaa
paaripOyina ghaDiya giitaalu paaDinaa
aakaalamEmaina iidaridaapu raalEdu
unna kaalamu kuuDa cuustunDagaa baaye ! .. aakaalamElaraa


9 comments:

  1. ఈ చేతి గడియారమాచేతికెట్టినా
    తీసేసి కొన్నాళ్ళు పారేసిచూసినా
    గోడమీదన దాన్ని తిరగేసి ఉంచినా
    లోనున్న ఆసెల్లు పీకేసి చూసినా ! ... ఆకాలమేలరా

    ఈ పంక్తులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.
    మీ ఊహకు హాట్సాఫ్
    మీ కవిత చదివాక ఇదే అంశంపై రెక్కలు రాయాలనిపించింది
    త్వరలోనే మీకవితకు కొనసాగింపుగా
    నా రెక్కలుబ్లాగులో http://rekkalu.blogspot.com
    లో పెడతాను.
    నమస్కారాలు.

    ReplyDelete
  2. శ్రీశ్రీ ఎక్కడో అంటాడు
    ఇరవయ్యో ఏడు మళ్లా ఎలా వస్తుంది అని :-)

    ReplyDelete
  3. రెక్కలు కట్టుకుని నా బ్లాగు పైన వాలిన తెలుగుకళకు స్వాగతం. కాలాన్ని మీరెక్కల్లో దాచుకుంటే ఆగుతుందేమో వచ్చి కనుక్కుంటాను. తప్పకుండా. ధన్యవాదాలు.

    బాబాగారు మంచి కవిత గుర్తు చేశారు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. గతం గతహః ,దాని గురించి ఆలొచిస్తె ఉన్న సమయం పొతుంది అని బాగా చెప్పారు ఆఖరిలొ.. బాగుంది మీ కవిత..

    ReplyDelete
  5. అందుకే కదా మరండి ఆత్రేయ గారు, ఆ కాలమిక రాదనే అప్పటి జీవితం ఇప్పటి కాలానికి copy & paste చేస్తున్నా, ఇక అంతా ఖుషియే. ఈ నా strategy మీకూ పనికొస్తదేమోచూడండి.

    ReplyDelete
  6. చాలా బాగుంది. ముగింపు కూడా బాగా చెప్పారు.

    ReplyDelete
  7. ఆదిత్య మాధవ్ గారు ధన్యవాదాలు.
    నాయిక గారు నా బ్లాగుకి స్వాగతం. కాపీ అవిడియా బాగుంది. తప్పకుండా అనుసరించి చూస్తా
    వంశీ ధన్యవాదాలు.

    ReplyDelete
  8. అనానిమస్ గారు ధన్యవాదాలు.

    ReplyDelete