Friday, January 9, 2009

ఏకశ్లోకి నా జీవితం

ఆదౌ అల్మరు క్లాకు కూత వినడం కాఫీకై కూర్చోవడం
టీవీలోదూరడం ఖరాబు కనడం టైమెంతొ చూస్కోవడం
దేశాన్నితిట్టడం బ్రష్షేసి తోమడం బస్సుకై కాపేయడం
ఆఫీసు హస్కు ఐదైతె ఆపేయడం ఏతద్దినాజీవనం


2 comments:

  1. నిజమే? ఎలా నమ్మేది మరో వ్యాపకం లేదంటే.
    అందమైన భావాలకు ఆకృతినిచ్చే టైమే లేదంటే
    ప్రియ నేస్తమై ఎందరి హృదయాలనో తట్టే మీకు
    ఈతద్దినాజీవనం అంటే నమ్మేదెలా

    పంటి బిగువున
    పొంచి ఉన్నది
    బాధైనా మరేదైనా
    జారిపడిన క్షణం
    తేలికవదా మనసైనా

    మొత్తానికి గుర్తించేసారు. అసాధ్యులు సుమా!

    ReplyDelete
  2. శృతి గారు బాగా అడిగారు. మీ వ్యాఖ్య బాగుంది. అసాధ్యులు మీరు ఆ తెలివి నాకాపాదిచ్చారు.

    ReplyDelete