Friday, January 9, 2009

వయసు

వయస్సెంత కఠినత కలది
బ్రతుకు గాధలొ బాధల్నేరి
మడతలు చేసి ముఖానికద్ది
మనిషిని ముదుసలి చేసేస్తుంది

చేతిని కాలిని ముఖాన్ని సైతం
వదలక వికృత ఆకృతులలికి
దరహాసాన్నీ వీడక మార్చినా
నిస్తేజులమై నిలబడి చూస్తాం

మొదటి మడత కధా అందంగానే
వెచ్చని ప్రేమలా, నెచ్చెలి ముద్దులా
గుండెగదులలో దాక్కుంటుంది
వీడక నీడగ కడపటి దాకా తోడిస్తుంది

గడిచేకాలం బ్రతుకు గాధలకు
మకిలిని చేర్చి ఇకిలిస్తున్నా
వయసు మాత్రమే అద్దంలాగా
గడిపిన బ్రతుకుకు సాక్షవుతుంది

http://musingsbytrinath.blogspot.com/2009/01/ag.html కి అనువాదము.

vayassenta kaThinata kaladi
bratuku gaadhalo baadhalnEri
maDatalu cEsi mukhaanikaddi
manishini mudusali cEsEstundi

cEtini kaalini mukhaanni saitam
vadalaka vikRta aakRtulaliki
darahaasaannii veeDaka maarcinaa
nistEjulamai nilabaDi cuustaam

modaTi maData kadhaa andamgaanE
veccani prEmalaa, necceli muddulaa
gunDegadulalO daakkunTundi
veeDaka neeDaga kaDapaTi daakaa tODistundi

gaDicEkaalam bratuku gaadhalaku
makilini cErci ikilistunnaa
vayasu maatramE addamlaagaa
gaDipina bratukuku saakshavutundi

2 comments:

  1. మనస్సెంత సున్నితమైనది
    కటువు జీవిత పుటల లోపలి నిటల సత్యపు రేఖలన్నీ
    బట్ట బయలై వదనమందున వేళ్ళూనుకొని విస్తరించినా
    కాలపు దూరపు గోడల దూకి వూహల బయళ్ళ విహరిస్తుంది
    ఏమంటావు నేస్తం ?

    ReplyDelete
  2. నిజమ్ చెప్పారు. నా బ్లాగుకు విచ్చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete