Wednesday, December 17, 2008

ఎండమావులు

పరిస్థితుల వేడికి
మనసు బీటలై
బంధాలు విడివడి
భావాలు బీడులై
ఆత్మీయత కోసం చేసిన
ఆక్రందనల పిదప
పిడచకట్టిన నా పదాల సాక్షిగ
చెమరటం మరిచిన
నా కళ్ళల్లో ఎండమావులు
ఆ నీరు చూసేవారికే
తుడిచే భాగ్యం నాకు లేదు !!


paristhitula vEDiki
manasu beeTalai
bandhaalu viDivaDi
bhaavaalu beeDulai
aatmeeyata kOsam cEsina
aakrandanala pidapa
piDacakaTTina naa padaala saakshiga
cemaraTam maricina
naa kaLLallO enDamaavulu
aa neeru cuusEvaarikE
tuDicE bhaagyam naaku lEdu !!

10 comments:

  1. నా మనసు వూటబావిని
    పూడ్చి పెడదామని తలపెడితే
    బావురుమంది, జల మీద జలగా
    వేయిజల్లుల వరదగా ఉప్పొంగిపోయింది
    బహుశా వేసవి దాటి వర్షాన్నీ దాటేసి
    శరదృతువు లోగిలికి పారిపోయొచ్చినట్లుంది.
    మీరు నా దారిన వస్తానంటే నే వదిలిన గుర్తులు చెప్తాను.

    - ఎప్పటిలానే ఈ ఒక్కసారికీ మన్నించేయండి. ఇదేదో మాయరోగం మీ కవితలు చూడగానే నా కలం, గళం రెండూ ఆగవు. ఇలా వాత [పులిని చూసి నక్క మాదిరి] చేత వాతలేయించుకుంటున్నాను - ఉష

    ReplyDelete
  2. Woh!!..super andi.

    అలజడుల ఆలోచనలు అమాంతం నిద్రలేసి
    అలిగిన ఉదయపు ఆనవాల్లపై అరచూపులు చూసి
    అలవాటుగా అంతలోనే అక్కున చెర్చుకున్నట్లుంది.

    -మీరిరువురి రాతలన్నీ తెగనచ్చేస్తున్నాయి.

    ReplyDelete
  3. ధన్యురాలను పృద్వీ! ఎదో రాముని చేయి సోకిన ఉడతమాదిరిది ఈ నా వైనం. దాన్ని మీరు గమనించటం, ప్రస్తావనకితేవటం నా అదృష్టం. నిజంగానే చాలా అద్భుతం, ఇది నిజమా కాదా అని గిల్లు కుంటాం చూడండి అలా, ఎంత అదృష్టం చేసుకోకపోతే ఈ స్పందన ప్రతిస్పందన వీలైవుతుంది, ఇంటర్నట్ వల్ల ఏదైనా సాధ్యం, లేకపోతే ఆత్రేయగారితో కవితాగోష్టి అంటే జరిగేదేనా?

    ReplyDelete
  4. అయ్యో ఉష గారు. నేను మీరనుకున్న ఆత్రేయ కాదు. అది నా కలం పేరు మాత్రమే. నేను ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పాల్సింది. క్షమించాలి.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ఫర్వాలేదండి! కొంచం నిరాశ, కోపం వచ్చాయి దేముడిమీద నేనడిందేదీ ఇవ్వవా అని. ఇక ఇప్పటికిలా సాగిపోదాం. మీరు ఆయన కన్నా ఏం తక్కువ కాదు. నా వరకు నా కలంకి వురకలు నేర్పిన ఘనత మీదే! దెబ్బలు తిని తిని నా మనసుకి ఏదైనా మంచి జరిగితే కొంచం సంశయం ఏక్కువేను. దానికి తోడు నన్నెపుడు ఆటలు పట్టించే ఒకరు 'అటక మీద దొరికిన ఫొటో మీద
    దుమ్ము దులిపేసరికి
    పాతికేళ్ళ నాటి ఘటనొచ్చి' ఉటంకించి కొంచం సందేహం కలిగించారు,మీరు దాన్ని నివృతి చేసారు! ఓ నవ్వు నవ్వేసుకున్నానంతే!

    ReplyDelete
  7. ఎంత మాట అన్నారు ఉషా గారు "మీరు ఆయన కన్నా ఏం తక్కువ కాదు. నా వరకు నా కలంకి వురకలు నేర్పిన ఘనత మీదే" . నా రాతలకి ఇంతకన్నా పెద్ద పొగడ్త ఏమి కావాలి ? మరీ చెట్టెక్కిస్తున్నారు. మీ అభిమానానికి సదా రుణుడనే!

    దెబ్బలు తింటేనే ఇనుము గొలుసవుతుంది.
    మంటల్లో మరిగితేనే మట్టి బంగారమవుతుంది.
    మనసు విరిచే మరపు రాని విషయాలు
    గుండెల్లో మరిగి కవితలై కళ్ళు తడుపుతాయి
    కాగితాలు నిండుతాయి
    మరువమయి తావి జల్లుతాయి.

    ReplyDelete
  8. అవునండీ.
    గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి!

    ReplyDelete
  9. గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి!

    aahaa.! usha garu.. fentastic ga chepparu..!!

    ReplyDelete
  10. చలా చాల బాగా రాస్తున్నారు

    ReplyDelete