Wednesday, December 17, 2008

తెలియని ప్రశ్న

ఈరోజు రాత్రి నా నిస్సత్తువలా
నాకంటే ముందే నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి నిద్రా దేవి
నా కళ్ళ తలుపులు తట్టాల్సింది

నా అస్తిత్వంలా తనుకూడా
నాపై అలిగినట్టుంది, ఇక రానంది

గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి
అష్టకష్టాలు పడుతుంది

చీకట్లో నిశ్శబ్దం నా అంతర్మధనానికి
నేపధ్య గీతంలా సాగుతోంది
నిట్టూర్పుల వేడి విషాదం
ఈ సమయంలొ నిషాలను నింపుతుంది

బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా

ఇక అలిసిపోయాను, ఇంకేమైనా చెయ్యాలని
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను

నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను

చింత తెస్తున్నానో చితి తెస్తున్నానో తెలియదు గానీ,
పులిమిన నవ్వులు మాత్రం చెరిపేస్తున్నాను

చితి చచ్చినోళ్ళనేకాలుస్తుంది
చింత బ్రతికుండగానే కాలుస్తుంది

ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకదే తెలియని ప్రశ్న, ఇక వేచిచూడాలి.


eerOju raatri naa nissattuvalaa
naakanTE mundE nannu cErindi
maamuulugaa eepaaTiki nidraa dEvi
naa kaLLa talupulu taTTaalsindi
naa astitvamlaa tanukuuDaa
naapai aliginaTTundi, ika raanandi
gODameeda cinna mullu
ee baruvaina kaalaanni neTTaTaaniki
ashTakashTaalu paDutundi
ceekaTlO niSSabdam naa antarmadhanaaniki
nEpadhya geetamlaa saagutOndi
niTTuurpula vEDi vishaadam
ee samayamlo nishaalanu nimputundi
baadhalo bhaavukata vetukkunTuu
navvulu pulumukuni aanandam naTistuu
naa prastutaanni gaDipEstunnaa
ika alisipOyaanu, inkEmainaa ceyyaalani
ee niSiraatrina naa jnaapakaaraNyamlO
nannu nEnu vetukkunTunnaanu
naa gatam nunDi nannu nEnu
periki teccukunTunnaanu
cinta testunnaanO citi testunnaanO teliyadu gaanee,
pulimina navvulu maatram ceripEstunnaanu
citi caccinOLLanEkaalustundi
cinta bratikunDagaanE kaalustundi
ee raatri naaku tellaarindO nEnE tellaaraanO
naakadE teliyani praSna, ika vEcicuuDaali.

5 comments:

  1. నాకూ మాత్రం నా గతమొంక చూడటం
    దండుగే అనిపిస్తుంది,
    సిలువేసిన శిధిలజీవి అగుపిస్తుంది.
    పెచ్చులూడుతున్న గోడ గురుతుకొస్తుంది,
    నేడు కూలనున్న మేడ అగుపిస్తుంది.
    చింత నిన్న నుండి తిరిగొచ్చినా నను వదలదు.
    పైపెచ్చు చితి నుండి లేచే పొగలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .
    నిదుర కూడా రాత్రంతా దాగుడుమూతలాడి,
    నే దిగులుగా కూలపడ్డాక,
    తనవారిని తిరిగి లేపుకోను ఖుషీగా పోతుంది.
    పగలు కూడ పట్టలేవని ఈలవేసి చెప్తుంది.
    దినమూ ఇదే నా వేతనం లేని వెర్రి చాకిరి.
    బ్రతుకు కినుక నా పైనా? ఇక చాలించని తన పైనా?
    - రోజుకొక మాత్రలా మనసు ఈ కవితకొరకు కొట్టుకుంటది - ఊష

    ReplyDelete
  2. నిశబ్దపు నీడల్లో నిలువుటద్దపు నిజాలను
    నిక్కసంగా తొంగి తొంగి చూస్తుంటే,
    నిట్టూర్పుల నిమిషాలు నీరసించక తప్పదేమో!!
    గుండెకొరిగిన గతంముద్రలు గంట గంటకూ
    గుర్తుకొస్తూవుంటే, కోరుకున్న జీవితాలు మళ్ళీ గడపాలనిపిస్తుందేమో!!
    నన్నునేను తెలుసుకునే నీ రాతలునంతకాలం
    నిన్ను మరిచిపోయినా, నీ నేస్తం వేరుకాదేమో!!
    నా అనుభవాలు ఆవరులై నీ కవితా వనరులయ్యాయేమో!!

    మీ ‘తెలియని ప్రశ్న’ కు సమాధానం చెప్పలేక పోయినా మీ కవితలకు జవాబు చెప్పాలని మనసు ఆరాట పడుతున్నది- పృథ్వీ

    ReplyDelete
  3. chala baaga chepparu aatreya garu..

    @usha garu
    mee bhavukatwam inka baagundi.

    ReplyDelete
  4. ఉషా గారు, వర్మ గారు మీ భావవ్యక్తీకరణ చాలా బాగుంది. మిమ్మలిని ఈ విధంగా స్పందింపచేసిన నా రాతల జన్మ ధన్యం అనుకుంటున్నాను.

    సుజ్జి మీరు అన్నది నిజమే, ఉషా గారి భావుకత్వం చాలా బాగుంది.

    ReplyDelete
  5. మీకు కూడా నేను గురుదక్షిణ సమర్పించుకోవాల్లేండి. మీకు కుదిరినపుడు ఒకసారి http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html చూడండి. ఈ నా కవితల్ని కలబోసి ఓ కావ్యం వ్రాసాను. అది మీకు మరో ప్రేరణనిస్తే నా కవితల జన్మ తరిస్తుంది.

    ReplyDelete