Wednesday, December 17, 2008

వెదుక్కుంటున్నా ..!!

మమతానురాగాలను వెనక వదిలి, ఇప్పుడు
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత కోసం వెదుక్కుంటున్నా ...

జ్ఞానమిచ్చిన నేల వదిలి వచ్చి, ఇక్కడ
నిర్జీవ కాంక్రీటు నగరాల్లో
ఆశలు తీరే దారులు వెదుక్కుంటున్నా ...

సాంప్రదాయ సంకెళ్ళను తెంచాననుకుని ఇప్పుడు
పాశ్చాత్య ప్రవాహాల్లో
అమాయకత్వానికర్ధం వెదుక్కుంటున్నా ...

కొత్త దేశం మోజులో వలస వచ్చి, ఇక్కడ
పచ్చనోట్ల మడతల్లో
పాత జ్ఞాపకాలను వెదుక్కుంటున్నా ...



mamataanuraagaalanu venaka vadili, ippuDu
iruku manasula janaaraNyamlO
aatmeeyata kOsam vedukkunTunnaa ...

jnaanamiccina nEla vadili vacci, ikkaDa
nirjeeva kaankreeTu nagaraallO
aaSalu teerE daarulu vedukkunTunnaa ...

saampradaaya sankeLLanu tencaananukuni ippuDu
paaSchaatya pravaahaallO
amaayakatvaanikardham vedukkunTunnaa ...

kotta dESam mOjulO valasa vacci, ikkaDa
paccanOTla maDatallO
paata jnaapakaalanu vedukkunTunnaa ...

5 comments:

  1. పచ్చనోట్ల మడతల్లో
    పాత జ్ఞాపకాలను వెదుక్కుంటున్నా ...

    chala baaga chepparu..!!

    ReplyDelete
  2. నేనూ వెదుక్కుంటున్నా ...
    వెదుకులాటలోనే వున్నానని వుసూరుమంటూనేవున్నా.
    ఎందుకంటే ఎపుడూ వెదుక్కుంటునేవున్నా,
    వెదికినవేవి నాకు దొరకవని గురుతుకీ రాదు మరి.
    వెదకాల్సినవింకేవీ లేవని ఆపేసిన క్షణం,
    నన్ను నేను మళ్ళీ వెదుక్కోవాలని అనిపిస్తుంది.
    నేను కనుక నాకు మళ్ళీ దొరికితే
    ఈ సారి మాత్రం వెదకటాన్ని ఇంకెవరికైనా వీలునామా వ్రాసేయాలని.
    వెతుక్కోవాల్సినవి మాత్రం వారు ఎంచుకోవాలని,
    నేను వెతికినవేవీ ఈ లోకంలో ఇంకెక్కడా వుండవని,
    నా కెపుడోనే తెల్సిందని చెప్పటానికి మాత్రం మాటలు వెదుక్కుంటున్నా.
    ఆవి వినే మనిషి కొరకు మాత్రమే ఇపుడు వెదుక్కుంటున్నా...

    ReplyDelete
  3. సుజ్జి ధన్యవాదాలు. ఉషా గారు బాగా చెప్పారు.

    ReplyDelete
  4. మీకు కుదిరినపుడు ఒకసారి http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html చూడండి. ఈ నా కవితల్ని కలబోసి ఓ కావ్యం వ్రాసాను. అది మీకు మరో ప్రేరణనిస్తే నా కవితల జన్మ తరిస్తుంది.

    ReplyDelete