Wednesday, December 17, 2008

'అను'క్షణం

గమ్యమేమిటో ?
గమన మెక్కడికో?

నా కోసం వేచిన ప్రాణికి,
నేనిచ్చే అనుభవమేమిటో ?

దరహాసమై చిగురిస్తానో ?
అశృ ధారలై ప్రవహిస్తానో ?

నిర్లిప్తంగా మరిచేస్తారో ?
దయలేదంటూ ఖండిస్తారో?

వేచిన క్షణమే వచ్చిందంటూ
వెచ్చని కౌగిలినందిస్తారో ?
పోయ్యేకాలము వచ్చిందంటూ
ఈసడింపుగ చీ కొడతారో ?

ఏదేమైనా జ్ఞాపకమొకటై
మిగిలెద నేనని"
తలచుంటుందా ?
మనను చేరిన 'అను ' క్షణం ?

gamyamEmiTO ?
gamana mekkaDikO?
naa kOsam vEcina praaNiki
nEniccE anubhavamEmiTO ?
darahaasamai ciguristaanO ?
aSR dhaaralai pravahistaanO ?
nirliptamgaa maricEstaarO ?
dayalEdanTuu khanDistaarO?
vEcina kshaNamE vaccindanTuu
veccani kougilinandistaarO ?
pOyyEkaalamu vaccindanTuu
eesaDimpuga cee koDataarO ?
EdEmainaa jnaapakamokaTai
migileda nEnani" talacunTundaa
mananu cErina 'anu ' kshaNam?

4 comments:

  1. కవితలోని పదాల మధ్య , వాటి భావాల మధ్య ఐదు గోదావరి వంతెనలంత ఖాళీలు కనపడుతున్నాయి ....ఖాళీలు..ఖాళీలు..ఖాళీలు పూడ్చండి బాబోయ్...వంతెనలు..వంతెనలు..వంతెనలు కట్టండీ బాబోయ్

    ReplyDelete
  2. వేచిన ప్రాణికి ప్రాణం నీ రాకే.
    వేదం నీవిచ్చే అనుభూతే.
    వేకువలో, వెన్నెల్లో, వీడ్కొల్లో
    వేయి భావనలకి మూలాధారమీవు ఓ "అను"క్షణమా!

    - అబ్బా, నువ్వు ఇంత విప్పి చెప్పాక నిన్ను జ్ఞాపకాల్లోకి పంపాలనిలేదు ఓ అనుక్షణమా, ఆత్రేయగారి కలంజార్చిన సిరాబొట్టా!!! - ఉష

    ReplyDelete
  3. excellent! simply superb. but as vamsi said it can be extended. good. keep writing..

    ReplyDelete
  4. ఉషాగారి సమాధానానికి ఏకీభవిస్తున్నాను.నేనుమాత్రం భావంవెతికి అంతర్థానమై ఆలోచనపడ్డాను...
    ఆలోచనలకు అక్షరరూపమిస్తున్న ఆత్రేయ గారికి అభినందనములు.

    ReplyDelete