నా ప్రస్తుతం నా ప్రమేయంలేకుండ
కరిగి గత మవుతుంది
గతమంతా నిండి నా బ్రతుకవుతుంది
స్వగతమయిన ప్రస్తుతాన్ని పరికించేలోపే
నా రేపు నేడవుతుంది నా నీడవుతుంది
నా నీడను పట్టి కట్టలేను
ఏ రేపునూ చూడలేను
గతంలో బ్రతకలేను
ఈ చక్రానికి విరుగుడెప్పుడు ?
naa prastutam naa pramEyamlEkunDa
karigi gata mavutundi
gatamantaa ninDi naa bratukavutundi
svagatamayina prastutaanni parikincElOpE
naa rEpu nEDavutundi naa neeDavutundi
naa neeDanu paTTi kaTTalEnu
E rEpunuu cuuDalEnu
gatamlO bratakalEnu
ee cakraaniki viruguDeppuDu ?
ప్రస్తుతం గతమయి అదే బ్రతుకయితే,
ReplyDeleteఆ బ్రతుకు బ్రతకలేకపోవటానికి గతమే గతి అయితే,
నీడలతో నిండిన రేపు చూడలేక ప్రస్తుతమే గతమయితే,
గతంలోని ప్రస్తుతమే చక్రాలయితే,
ఆ చక్రాల్లోని రేపే నేడవుతే,
నేటి రేపే ప్రస్తుతపు గతమయితే,
గతమయిన ప్రస్తుతమే నీడలాటి రేపయితే,
రేపటి నీడలే గతంలోని ప్రస్తుతానికి గుర్తులయితే,
రేపటి నీడను పట్టి కొట్టలేను
ప్రస్తుతపు రేపటిలో బ్రతకలేను
ఈ కవితలు నేను చదవలేను
ఈ చక్రానికి విరుగుడెప్పుడు ?
just kidding - No hard feelings pls..
వంశీ గారు. అబ్బే hard feelings ఏమీ లేవండి. నే రాసిన దాని కంటే మీరు రాసిందే బాగుందనిపిస్తుంది. మొత్తానికి చదవలేను అంటూనే మొత్తమ్ చదివారు. స్పందించి దానికి కామెంటూ రాశారు. ధన్యవాదాలు. అదే జీవితం. మన ఇద్దరిదీ ఒకటే ప్రశ్న. దీనికి విరుగుడెప్పుడు అనే. సంతోషం.
ReplyDeleteకవి గారూ ఎంత సరళం గా చెప్పేసారో.కాని ప్రశ్నే చాలా పెద్దది."నా రేపు నేడవుతుంది నా నీడవుతుంది"ఇక్కడయితె నేను చాలా అక్షరాలు వృధాచేసేదానిని.మీరు గ్రేటండి.
ReplyDeleteవంశీ గారు చాలా బాగుందండి.ఆత్రేయ గారి కవితలోని పదాలే మీవి కూడా.భావమూ అదే.కానీ ఏమిటో ప్రత్యేకత వుంది ...నాకు తెలియటేదు.మొత్తానికి బావుంది.కానీ కవితలో ఈ కవితలు చదవలేను అని ఎందుకు వచ్చిందో అర్ధం కావట్లేదు.
ReplyDeletevamsi garu
ReplyDeletenedu repu gurinchi inta chakkaga teliparu . adbhutam
adE jeevitam anTE mari. btw vamsi gAri comment konchem konTE gAnE unTundi E blog lO aina. :D
ReplyDelete