చేసే పూజల ధూపం ఏమౌతుంది
చెప్పే బాధల భారం ఎటుపోతుంది
అర్పించే గుండె చెక్కల భోగాలకు అంతాలెప్పుడు
మండే మనసుల హారతులకు అర్ధాలెప్పుడు
వేదన గీతాల మంత్రాల నేపధ్యంలో
పెక్కు ప్రసాదాలు కడుపార మెక్కుతూ
తొణకని నీ బూటకపు చిరునవ్వు
నా అసహాయతకు వెక్కిరింపా?
నా అమాయకత్వానికి కనువిప్పా?
తీరని ఆశల కోతలో
మండే గుండెల బాధలో
అడిగిన ఆశ్రిత జీవిని
అన్యధా అనుకోకు స్వామీ !!
http://venugaanam.blogspot.com/2008/11/rasidu-patram.html
ReplyDeleteపై లింకులో భగవంతుని ప్రేమకు మరో అర్ధం చెప్పారు. గమనించారా?
మీ కోణం కూడా బాగుంది.
బుల్లోజు బాబా గారు
ReplyDeleteధన్యవాదాలు.
మీరు పంపిన లింకు చూశాను.
మోహన గారి ఆలోచన చాలా బాగుంది.
తనకి తెలియని, వ్యక్త పరచని నిగూఢ నిస్వార్ధ ప్రేమకే
దేవుని చిరునవ్వును రసీదు అన్నారు. ఎటువంటి ప్రేమ చూపకున్నా ఆయన ఆ నవ్వు చెరగదు గా ?
ఆ నవ్వుకు అర్ధం మారేది, మన ఆశను బాహాటంగా వ్యక్తంచేసి, ఆర్తిగా అర్ధించి, ఆశగా ఎదురు చూసినా కలలు కల్లలుగానే మిగిలినప్పుడు, ఆ నవ్వు రసీదు గా కన్నా, కొన్ని వేల డాలర్ల క్రెడిట్ కార్డు బిల్లు లానే కనిపిస్తుంది.
నా పరిస్థితి అదే.