అలిసిన ఊహలు విసిగిస్తున్నా
బలమున వాటిని బంధిస్తున్నా
రానని నవ్వులు పరుగిడుతున్నా
వాటిని మోముపై పులిమేస్తున్నా
నీ ఆటలకిక అంతం లేదా
నా ఓటమి నీక్కనపడలేదా
ఆగక కన్నులు చెమరేస్తున్నా
త్వరపడి వాటిని తుడిచేస్తున్నా
ఓటమి నాపై నడిచేస్తున్నా
రోషపు రంగులు పులిమేస్తున్నా
నీ ఆటలకిక అంతం లేదా
నా ఓటమి నీక్కనపడలేదా
ఇకసరి,
నేనోడితి,
మోకరిల్లితి,
ఓటమినొప్పితి
దోసిలి ఒగ్గితి
నీ గొప్ప పొగిడితి
నీ పాదము కడిగితి
ఇకనైనా.. నీ ఆటలకు అంతం లేదా
నా ఆక్రందనలు వినపడలేదా
alisina uuhalu visigistunnaa
balamuna vaaTini bandhistunnaa
raanani navvulu parugiDutunnaa
vaaTini mOmupai pulimEstunnaa
nee aaTalakika antam lEdaa
naa OTami neekkanapaDalEdaa
aagaka kannulu cemarEstunnaa
tvarapaDi vaaTini tuDicEstunnaa
OTami naapai naDicEstunnaa
rOshapu rangulu pulimEstunnaa
nee aaTalakika antam lEdaa
naa OTami neekkanapaDalEdaa
sarE, dEvuDuu..
nEnODiti,
mOkarilliti,
OTaminoppiti
dOsili oggiti
nee goppani pogiDiti
nee paadamu kaDigiti
ikanainaa.. nee aaTalaku antam lEdaa
naa aakrandanalu vinapaDalEdaa
mee kavitha daaham teeranidi la undi..!! im really impressed with ur work..!!
ReplyDeletematallo cheppalenanta bavundi ee kavita....baaga adigaru...abhinandhanalu.
ReplyDeletesujji and haasini
ReplyDeletethank you very much for ur folloing my blog and for ur comments and constant support. appreciate ur time and kindness.
sujji gaaru
yes ee kavitaa daaham teeranidE, my next kavita would be an answer for ur comment. dhanyavaadaalu.
రానని నవ్వులు పరుగిడుతున్నా
ReplyDeleteవాటిని మోముపై పులిమేస్తున్నా
బావుంది, మనసుకవిగారూ,
సరే, దేవుడూ..
ఈ లైన్ మారిస్తే యెలావుంటుందీ?
లలిత గారు మీ సలహా కు ధన్యవాదాలు. 'దేవుడు ' మనకి కనపడడు. ఎప్పటికీ.. అందుకే తీసేశా !!
ReplyDelete