
నిశిరాతిరి
మాలిణ్యాలను కరిగిస్తోంది.
వెచ్చని అశక్తత
మంద్రంగా వీస్తోంది.
అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం
గంధరహిత పుప్పొళ్ళను
గుండెలనిండా పులుముతూ
తనువునూపుతూ
స్వరరహిత గీతంతో
మనసును తాకుతూ
మూసిన రెప్పల వెనక
కరిగిన కాలం
మిణుగురులవుతుంది
రేపటి ఆశ లేదు
ఈ నిశి రాతిరే శుభోదయం.
చాలా బాగుంది. నిశిరాతిరి శుభోదయం చీకటి వాకిట వెలుగు మరకల సూర్యోదయం...
ReplyDelete