Sunday, October 17, 2010

వీడ్కోలు


ఆ వీడ్కోలు క్షణంలో
నిర్వీర్యమయిన నీ ముఖం
నన్ను వెంటాడుతూనే ఉంది

ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని

దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులకు
చెక్కు ముక్కలకే
పరిమితమై పోతున్నాయి

నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి
నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం
ఏ చెక్కుతో కొనగలను ?

ఒద్దనుకున్న క్షణాల్లో
స్థంబించే కాలం
ఇపుడు చిన్నగా నైనా
కదలదే?

బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.

గడిపిన నెల రోజుల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది

కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..

ఆగిపోతే బాగుండు.

4 comments:

  1. నర్మగర్భంగా ఉండి మీ కవిత. బాగుంది.

    ReplyDelete
  2. మనసుని తట్టి చెప్పినట్టుందండీ మీ కవిత!Very touching!
    చివరి ఐదు లైన్లు అద్భుతం! అలానే అనిపిస్తుంది కొన్నిసార్లు. :)

    ReplyDelete
  3. ఆనందం ఎప్పుడూ బూడిద కాదు..
    అవి మధురాతి మధురక్షణాలే..
    ఆ తీపి మధురాలు మళ్లీ మళ్లీ కావాలniపిస్తుంది
    అందుకే
    ఒక్కక్షణం
    గుండెలు బరువెkkuతున్నా
    మాటలు రాkuన్నా
    ఊపరి ఆడkuన్నా

    ఆగిపోతే బాగుండaniపిస్తుంది
    ఏమైనా మీ కవిత కన్నీళ్లు పెట్టించింది.
    హృదయాnni కదిలించింది.

    -niశిత

    ReplyDelete
  4. దూరాలు పెరిగే కొద్దీ
    ప్రేమలు ఆప్యాయతలు
    ఫోను తంత్రులకు
    చెక్కు ముక్కలకే
    పరిమితమై పోతున్నాయి ikkade agipoyanu. nijam meeru chepindi.
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete