Thursday, November 19, 2009

ఎవరికోసం .. ?


బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

ఎవరికోసం .. ?

11 comments:

  1. చాలా బాగుంది అంది మీ కవిత

    ReplyDelete
  2. బంధాలు త్రుంచమంటూ
    అదిరే పెదవుల అభ్యర్ధన,
    ఆత్మ సమర్పణ ఎందుకోసం ... హ్మ్మ్ భందాలు తుంచే అభ్యర్ధనల మధ్య ఆత్మ సమర్పణ... ఆశ్చర్యం గా వుందే..

    ReplyDelete
  3. "కురిసి వెలిసిన నింగి వెలితి
    మనసు నిండా నింపుకుటూ.."

    సాధారణంగా వాన వెలిసాక తేట పడటం వాడుక. మీ ప్రయోగంలో అది వెలితిగా చూపారు. అంటే వెలితి వైశాల్యానికి ప్రతీకగా, అనంతాకాశంత వెలితి ఆ మనసున నిండింది అనా మీ ఉద్దేశ్యం?

    వర్షాభావం వలన ఇక్కట్లలో వున్న పేదరైతు నా మీరు ఇక్కడ అంశంగా తీసుకున్నది? లేదూ వాన అనే ఆశ కొరకు చూస్తున్న నిరాశాజీవి నా?

    ReplyDelete
  4. ఆత్రేయ గారు ఉష గారు చెప్పినట్ట్టు

    "కురిసి వెలిసిన నింగి వెలితి
    మనసు నిండా నింపుకుటూ.."

    నేను ఇక్కడ కొంతసేపు ఆగి పోయాను...
    నాలో నేను వివరించుకుంటూ, ఈ వాక్యానికి అర్ధం విస్తరించుకుంటూ ..

    బట్ స్టిల్ ????????????????????

    ReplyDelete
  5. ఆత్రేయ గారు ఉష గారు చెప్పినట్ట్టు

    "కురిసి వెలిసిన నింగి వెలితి
    మనసు నిండా నింపుకుటూ.."

    నేను ఇక్కడ కొంతసేపు ఆగి పోయాను...
    నాలో నేను వివరించుకుంటూ, ఈ వాక్యానికి అర్ధం విస్తరించుకుంటూ ..

    బట్ స్టిల్ ????????????????????

    ReplyDelete
  6. http://mGinger.com/index.jsp?inviteId=1435613

    ReplyDelete
  7. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete
  8. ఆత్రేయ గారూ,

    ఉష గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే వినాలని ఉంది

    ReplyDelete
  9. శ్రావ్య గారు ధన్యవాదాలు

    భావన గారు.. కొందరు అభాగ్యుల జీవితాల్లో, అభ్యర్ధనలు మాటగా మారి పెదవుల మీదుగా దొర్లే లోపలే అవి సమసిపోతాయి. కోర్కెలు తీరే ఆశ చావక ముందే అందుకు వలసిన దారులు తుడుచిపెట్టుకు పోతాయి. అటువంటి సంఘటను నేను, అభ్యర్ధనల ఆత్మ సమర్పణగా (అతను వాటికి అంతమొందించలేదు కనుక) వ్యక్త పరిచాను. ఇంతకంటే బాగా చెప్పవచ్చేమో.. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ఉష గారు ఆమాటలు వ్రాయడానికి ముందు చాలా ఆలోచించానండీ.. మీకు బాగానే అర్ధం అయ్యింది. ధన్యవాదాలు. సాధారణంగా వాన వెలిశాకా, ఓ ఏడుపు ఏడిచాకా చాలా స్థబ్దంగా ఉంటుంది, అది ప్రశాంతతకు ప్రతీక కావచ్చు, నిర్లిప్తత, నిస్సహాయత కావచ్చు, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఏమీ తోచని పరిస్థితి, ఏమి చేసిన ఉపయోగము కనపడని పరిస్థితిని చెపడంవల్ల, దానిని నేను శూన్యంగానూ, వెలితి గానూ, అభివర్ణించాను. ఇంత నిస్సహాయతలోనూ.. జీవము ఉంది కనుక, పోరాటాన్ని కొనసాగించాలి (వేరే గత్యంతరం లేక) అన్న అతని నిర్ణయాన్ని, మెరుపుతోనూ, గుడ్డిదీపపు వెలుగు తోనూ పోల్చాను. ఇంతచేసినా.. ఇంకా బ్రతికినా ఎవరికోసం? అన్న నీడ ఆ దీపము క్రింద ఇంకా తచ్చాడుతూనే ఉంది. అది తెలిసే చివరిగా అతని ప్రశ్న "ఎవరికోసం ? ". ధన్యవాదాలు. సమయాభావం వల్ల, ఇటుగా తరచు రాలేక పోతున్నాను. ఆలశ్యానికి మన్నించగలరు.

    సింధు గారు ధన్యవాదాలు.

    కార్తీక్‌ గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటాను.

    జిపిరెడ్డి గారు ధన్యవాదాలు

    మంకీటుమేన్‌ గారు మీ లంకె చూశాను చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి కవితల సరసన నా మాటలను ఉంచినందుకు.

    మానస సంచర గారు మీ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చిందనుకుంటాను.

    బ్లాగు మిత్రులందరికీ చాలా ఆలశ్యంగా ప్రత్యుత్తరమిస్తున్నందుకు క్షమాపణలు.

    ReplyDelete