పురిటినొప్పుల్లా తెరలు తెరలుగా
తడిమిన తరుణాలు
మౌనాన్ని ప్రసవించి మరలి పోతాయి
జ్ఞాపకాలు ఆలపించిన గీతాలు
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి
సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి
భాష జార్చుకున్న
బరువు భావపు ప్రతి కదలికా
ఏ రంగూ తగలని కవితే..
ఈ కవితా సాగరంలో తేలుతూ నేనూ...
బావుంది. ఎండురెప్పలు అర్థం కాలేదు. కవిత మూడు నలుగు సార్లు చదివాక కానీ బోధపడలేదు భావం. చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంది .. కానీ చాలా బావుంది.
ReplyDeletebaaga chepparu
ReplyDeleteఇన్నాళ్ళ మౌనం తర్వాత కూడా" మౌనం "తోనే పలకరింపా ....గురువుగారు !
ReplyDeleteవాసు గారు ధన్యవాదాలు. తినగ తినగ వేము తియ్యగా ఉంటుందని తీపి చేదవుతుందని అంటుంటాము.. అంతే దాని ప్రాకృతిక స్వభావం వీడి వ్యతిరేక లక్షణాలు ప్రతిఫలిస్తాయి. అలానే, కన్నీరు అలా జారి జారి .. ఆ రెప్పల మధ్య తడిని వదలడం మాని వాటిని ఎండపెడుతున్నాయి అని అర్ధం.
ReplyDeleteసుజ్జి గారు ధన్యవాదాలు.
పరిమళం గారూ.. మ్మ్ మౌనాన్ని మాటల్లో పెడితే తప్ప అర్ధం కావడంలేదన్న మాట తెలుసుకుని ఇలా మళ్ళీ వచ్చా.. కూసిని మాటలతో..మౌనంగా.. ధన్యవాదాలు.
wow
ReplyDeleteచాలా బాగా రాసారు
ReplyDelete