Tuesday, November 17, 2009

తోడు



గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..

మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..

జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..

తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..

ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..

బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.

నీతోడు పొందాలనుంది.

12 comments:

  1. బ్రతుకు బండి ని తోసుకుంటూనే మేమైతే ఆస్వాదించేస్తున్నాము మీ కవితలు.. :-)

    ReplyDelete
  2. ఇవన్నీ..
    చిత్తడి అడవిలో..
    బెరడు గంధంలా ..
    చీకటి పొదల్లో
    కీచురాళ్ళ గానంలా ..
    అజ్ఞాతంగా..
    తాకుతున్నాయి..
    జారిపోతున్నాయి..


    wonderful gaa undi. good feel

    ReplyDelete
  3. తలపుకు రావడంలేదూ ..
    ఆశ సంధించిన శుభోదయాలూ..
    బాధ ముంచిన సాయంకాలాలూ..

    ఈ కన్నీళ్ళే చివరంటా వేలిచివరల దాగిన సుతిమెత్తని అనుభూతిని ప్రవహింపజేస్తాయి. ధన్యవాదాలు సార్.

    ReplyDelete
  4. మీ కవిత బావుంది గురువుగారు !
    గుర్తుకొస్తుంది
    కాగితమెక్కిన అలకను
    అక్షరాసుమాలతో తీర్చిన వైనం
    తలపుకొస్తున్నాయి
    విడదీసిన సాయంత్రాలే
    మనల్నితిరిగి కలిపిన రోజులు
    బ్రతుకుబండి భారమైనా
    ఒకరికొకరం తోడూ నీడగా
    కలిసి సాగిస్తే ఆ పయనం
    మధురాతి మధురం !

    ReplyDelete
  5. చాలా చాలా చాలా బాగుంది మీ కవిత

    బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి ఆస్వదించాలని వుంది అద్బుతం.

    ReplyDelete
  6. "చిత్తడి అడవిలో..
    బెరడు గంధంలా ..
    చీకటి పొదల్లో
    కీచురాళ్ళ గానంలా ..
    అజ్ఞాతంగా..
    తాకుతున్నాయి..
    జారిపోతున్నాయి.."

    Beautiful lines!!

    ReplyDelete
  7. "బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
    ఆస్వాదించాలనుంది.."

    ప్చ్, సాధ్యమా? అంతటి వరం మనకు దక్కునా? ఆ చేయీ ఈ చేయీ కనీసం కలిసున్నాయి అని తృప్తి పడటమే కాని.

    ReplyDelete
  8. భావన గారు మీ బండి సదా సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను.
    బాబా గారు ధన్యవాదాలు.
    వర్మగారు.. నిజంచెప్పారు.. నెనరులు.

    పరిమళం గారూ..నిజమే కలిసి సాగిస్తే పయనాలు బాగానే ఉంటాయి. విడిపోయి ఎవరిదారిన వారు వెళ్ళినప్పుడే.. ఇలా ప్రస్తుతాలు తడిసేది.

    విజయ భారతి గారు సుజ్జి గారు కవిత మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందండీ.

    నిషి గారు చాలా సంతోషం.

    ఉష గారూ.. ఆ వరం దక్కితే ఇక అస్వాదించేదేముంటుంది , కాళ్ళదగ్గిర పెట్టిన అగరువత్తులు తప్ప :-).. నిజంగా.. ఆతృప్తే ఎంత పెట్టినా కొనలేనిది, అంత తేలికగా దొరకనిదీనూ..

    రవీందర్ గారు చాలా సంతోషం.

    కనుమూరి వారికి ప్రణామాలు. మీకీ కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  9. ఎంత బాగా పదాలు అల్లుకున్నాయి
    నాకు చాలా అసూయగా వుంది
    మీ పద బంధనం, భావ వ్యక్తీకకరణ ..
    నాకూ నేర్పరూ ?

    ReplyDelete