Wednesday, August 26, 2009

పిలుపు


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
శవం బ్రతికినట్టనిపించింది..
శిల కరిగినట్టనిపించింది.

4 comments:

  1. ఎన్నెన్ని మారులు విన్నా
    కొత్తగా సరికొత్తగా వినిపిస్తుంది
    అదేమి మాయో కాని
    ప్రతి భావం, మీ కవితలో
    చమక్కులే మెరిపిస్తుంది.

    గురువు గారూ, ఇది నిజం

    ReplyDelete
  2. శృతిగారి వ్యాఖ్యే నాది కూడా!

    ReplyDelete
  3. చెలి పిలుపు లోని శక్తి అలాంటిది మరి. బాగుంది సార్.

    ReplyDelete
  4. Sruti gaariki, padmaarpita gaariki, varma gaariki dhanyavaadaalu.

    ReplyDelete