పిలుపు
చెరిగిన బొట్టునెవరోతిరిగి దిద్దినట్టనిపించిందిఆ గుడిలో గంటమరల మ్రోగినట్టనిపించిందిఆ మెలికలు తిరిగిన నడకఅదిరి ఆగి నిలిచిన లేడినిలకడగా..
కదిలినట్టనిపించిందిరెప్ప తెంచుకునిమనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికితలను మూర్కుని తనువు చాలించినేచూపులు..
ఈసారి పూసినట్టనిపించింది.
నీ పిలుపుతో..
చెలీ..
ఓ శవం బ్రతికినట్టనిపించింది..
ఈ శిల కరిగినట్టనిపించింది.
ఎన్నెన్ని మారులు విన్నా
ReplyDeleteకొత్తగా సరికొత్తగా వినిపిస్తుంది
అదేమి మాయో కాని
ప్రతి భావం, మీ కవితలో
చమక్కులే మెరిపిస్తుంది.
గురువు గారూ, ఇది నిజం
శృతిగారి వ్యాఖ్యే నాది కూడా!
ReplyDeleteచెలి పిలుపు లోని శక్తి అలాంటిది మరి. బాగుంది సార్.
ReplyDeleteSruti gaariki, padmaarpita gaariki, varma gaariki dhanyavaadaalu.
ReplyDelete