చూపులు కలిసే లోపే
తెరలు దిగిపోతాయి..
వంతెనలు కరిగి పోతాయి..
ఊసులు వెనుతిరిగి వస్తాయి..
మరో ప్రయత్నం
మరింత బలంగా..
అసంకల్పితంగా..
మొదలవుతుంది..
తీరం చేరే అలల్లా..
ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?
తలలు తిప్పుకున్న ప్రతిసారీ
గుండెలు పిండే అనుభూతి..
నన్ను చూస్తున్నావన్న
అదో తృప్తి.
అదే ఇంధనంగా..
మళ్ళీ రెప్పలు లేస్తాయి
తిరుగుతున్న తలనాపడానికో ..
జారుతున్న రెప్పలనడగడానికో ..
జారిపోయిన అల..
మరో సారి తీరం వైపు ఎగురుతుంది.
తిరిగి మరలడానికి.
మళ్ళీ చాలా కాలానికి ఉషోదయం తో మొదలు పెట్టి కొద్దికొద్దిగా వేడి తీవ్రతను పెంచుతున్నారా? బాగుందండీ ;)
ReplyDeleteకవితలోని భావం కనులలో కనిపిస్తుంది, కాని కాస్త భయంగా వుందండి!
ReplyDeleteభారారె గారు అవునండి ఈ మధ్య పని వత్తిడివల్ల అస్సరు సమయం దొరకడంలేదు. అప్పుడప్పుడు వచ్చి ఊహలను కాగితాల మీద రాసుకుని, ఇప్పుడు వాటిని నిదానంగా బ్లాగీకరిస్తున్నాను. మీకు కవితనచ్చినందుకు ఆనందంగా ఉంది.
ReplyDeleteపద్మార్పిత గారూ.. దీనికే భయపడి పోతే ఇక తెలుగు సినిమాలు ఎలా చూస్తారండీ !! నాకు ఆ కన్నులో స్వచ్చమయిన నీరు, ఓ కెరటము, ఓ తృప్తి కిరీటమూ, ఆశ, ఆందోళన, ఆశ్చర్యము, ఆదుర్దా.. ఉండాలని ఓ వారానికి పైగా వెతికితే ఇది కనపడింది. ఇక ఆలోచించకుండా వాడేసుకున్నాను. ఇలా చిన్న చిన్న వాటికి భయపడకండీ.. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. భయపెట్టినందుకు క్షమాపణలు.