నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !
రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!
తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..
అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.
published in poddu.net (http://poddu.net/?p=3220)
తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ReplyDeleteఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..బాగుంది!
Wow... excellent!!
ReplyDeletenew settings of ur blog r even cool :)
ReplyDeleteపద్మార్పిత సుజ్జి గార్లకు ధన్యవాదాలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteasalu bagaledu mee kavitha just change
ReplyDelete"udayinche suryunigurthuga
oka chukkanayi jaluvarutunna,
andamayina selayeruku swagatham palukutunna,
ushassulo yashassunayi udayistunna,
mullulanti jeevitham nundi
rojalanti andamayina manasu
bayatiki vastundi...
egise keratame naku adarsham
egisi padutunnanduku kaadu
padda lestunnanduku.................
ఆషిక్ గారు మీ వ్యాఖ్యను ఇలా చదువుకున్నాను.
ReplyDelete"అసలు బాగాలేదు మీ కవిత just change
"ఉదయించే సుర్యుని గుర్తుగా
ఒక చుక్కనయి జాలువరుతున్నా,
అందమయిన సెలయెరుకు స్వాగతం పలుకుతున్నా,
ఉషస్సులొ యశస్సునయి ఉదయిస్తున్నా,
ముల్లులాంటి జీవితం నుండి
రోజాలాంటి అందమయిన మనసు
బయటికి వస్తుంది...
ఎగిసే కెరటమే నాకు ఆదర్శం
ఎగిసి పడుతున్నందుకు కాదు
పడ్డా లేస్తున్నందుకు................."
చాలా బాగా వ్యక్తంచేశారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. నా నిరాశాకవితకు తగిన ఆశాజనకమయిన కవిత రాశారు అభినందనలు.
ఇక నచ్చడం నచ్చకపోవడం అంటారా..!? అందరి భావాలూ,,, అన్ని భావాలూ... అందరికీ నచ్చాలని లేదుకదండీ.. ఐనా నిర్మొహమాటంగా నచ్చలేదు అన్నారు .. చాలా సంతోషం. ఓ ప్రేరణ కలిగించింది మీలో అది మరీ ఆనందం. ఇలా వస్తూ ఉండండి. మీ వ్యాఖ్యలు రాస్తూ ఉండండి. మరో సారి ధన్యవాదాలు.