Monday, August 10, 2009

ఎదురు జల్లు...


అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-

చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-

కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-

ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-

ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-

ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-

చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.

10 comments:

  1. చాలా బాగు౦ది.చూసిన౦తా సేపురాని నవ్వు....వెర్య్ గుడ్

    ReplyDelete
  2. "తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని."
    "గోడమీద కాలానికి
    కీ ఇవ్వడం మరిచానేమో.."
    "అందరూ నీలానే కనిపిస్తారు"
    "చెవులూ అలుస్తున్నాయి."
    - Wow! good poem!!!

    ReplyDelete
  3. చివరి పాదాలు చదివి కొద్దిసేపు కనులుమూసుకొని ఆ నిశ్శబ్ధ సంగీతాన్ని అంభవించాను సార్. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. సుభద్ర గారూ, S గారూ, విశ్వ ప్రేమికుడు గారు, వర్మ గారు బాబా గార్లకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
    Download from www.findindia.net

    ReplyDelete
  6. రామ్ గారు నా బ్లాగుకు స్వాగతం. నమస్కారములు. ఏదో ఇలా కవితలు రాసుకుని కాలం గడుపుతున్నాను. ఇలా అసందర్బంగా కామెంటట్టడం అంత అవసరమా చెప్పండి ? నాకు ఏ తెలుగు సోషల్ బుక్ మార్కింగ్ సైటుల్లోనూ పోస్ట్ చేసే ఆలోచన గానీ అందులో ఆనందంగానీ లేవు. ఇలా అన్సొలిసిటెడ్ ఎడ్వర్టైజు మెంట్లంటే నాకు నచ్చదు. దయచేసి అలా చేయకండి. మీరు నామంచికే చెప్పి ఉండవచ్చు, ధన్యవాదాలు. మీరు చెప్పిన ఆ నొక్కుడు బిళ్ళను నా బ్లాగులో చేర్చాను. ఓ వెయ్యి మంది వచ్చి చూస్తారేమో ఇవాళ చూసి రేపు తొలిగిస్తాను. ఇలా రాసి మిమ్మల్ని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. దీనివల్ల నేను నొచ్చుకున్నాను అని చెప్పడమే ! మరో సారి ధన్యవాదాలు.

    ReplyDelete
  7. ప్రతి శబ్దమ్ లో నీ అడుగుల అలికిడి వెతకలేక నా చెవులు అలుస్తున్నాయి....


    చాలా బావుంది...ఆత్రేయ గారు :)

    ReplyDelete
  8. అందరూ నీలానే కనిపిస్తారు
    దగ్గరకొచ్చేదాకా..
    beautiful sir !

    ReplyDelete
  9. ప్రణు , పరిమళం గారు ధన్యవాదాలండీ.

    ReplyDelete