Sunday, August 9, 2009

పయనం...



కారడవి నడుమ, శిధిలాల మధ్యగా
మట్టి దారి ! ఏకాంతం తోడుగా..
కాలం కాగడా వెలుతురులో..
సాగిపోతోంది....

గతవైభవాల మట్టి దులుపుకుంటూ..
చింత చెట్ల నీడల్లోంచి..చిత్తడి నేలల్లోంచి
మలుపులు తిరిగి తిరిగి
అలసిన ముఖాన్ని తుడుచుకుంటూ...

వీడిపోతున్న కాలి బాటలు
మిగిల్చిన వైరాగ్యాన్ని
మైలు రాళ్ళలో దాచుకుంటూ..

స్థిరంగా.. అస్థిర గమ్యం వైపు.
ఆశ వేగంతో.. అనంత దూరాలకు
ఆగని.. నిరంతర.. పయనం...

4 comments:

  1. స్థిరంగా.. అస్థిర గమ్యం వైపు.
    ఆశ వేగంతో.. అనంత దూరాలకు
    కట్టెల కాష్టంలో ..కాలేదాకా
    ఆగని.. నిరంతర.. పయనం.

    బాగుంది గా ఆ..:)
    ఆత్రేయ వాణి .. నిరంతర వాణి

    ReplyDelete
  2. తిరుగులేదు....సాగిపొండి ముందుకు :)

    ReplyDelete
  3. మీ కవితలకి బాగుంది బాగుంది అని చెప్పడం చాలా మాములుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగని, మీ అంత అందంగా చెప్పడమేమో రాదు కదా :(

    ReplyDelete
  4. భారారె గారు ధన్యవాదాలు. మొత్తానికి ఆకాశవాణి న్యూజెర్సీ కేంద్రం చేశారుగా నన్ను. ఏమో కాలింతరవాత కూడా.. కొనసాగుతుందేమో.. నినువీడని నీడను నేనే ట్వై.. ట్వై.. అంటూ.. :-)

    పద్మ గారు ధన్యవాదాలు.

    వాణీ వీణా నినాదం చాలా కాలనికి వినబడిందే !? రాతల్లో అందం ఉండదండీ.. చదివేవారి కన్నుల్లోనూ.. చదివినప్పుడు రేగిన ఆలోచనా తరంగాల్లోనూ ఉంటుంది. ధన్యవాదాలు.

    ReplyDelete