అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-
చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-
కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-
ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-
ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-
ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-
చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.
చాలా బాగు౦ది.చూసిన౦తా సేపురాని నవ్వు....వెర్య్ గుడ్
ReplyDelete"తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని."
ReplyDelete"గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో.."
"అందరూ నీలానే కనిపిస్తారు"
"చెవులూ అలుస్తున్నాయి."
- Wow! good poem!!!
nice :)
ReplyDeleteచివరి పాదాలు చదివి కొద్దిసేపు కనులుమూసుకొని ఆ నిశ్శబ్ధ సంగీతాన్ని అంభవించాను సార్. ధన్యవాదాలు.
ReplyDeleteసుభద్ర గారూ, S గారూ, విశ్వ ప్రేమికుడు గారు, వర్మ గారు బాబా గార్లకు ధన్యవాదాలు.
ReplyDeleteInstall Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
ReplyDeleteDownload from www.findindia.net
రామ్ గారు నా బ్లాగుకు స్వాగతం. నమస్కారములు. ఏదో ఇలా కవితలు రాసుకుని కాలం గడుపుతున్నాను. ఇలా అసందర్బంగా కామెంటట్టడం అంత అవసరమా చెప్పండి ? నాకు ఏ తెలుగు సోషల్ బుక్ మార్కింగ్ సైటుల్లోనూ పోస్ట్ చేసే ఆలోచన గానీ అందులో ఆనందంగానీ లేవు. ఇలా అన్సొలిసిటెడ్ ఎడ్వర్టైజు మెంట్లంటే నాకు నచ్చదు. దయచేసి అలా చేయకండి. మీరు నామంచికే చెప్పి ఉండవచ్చు, ధన్యవాదాలు. మీరు చెప్పిన ఆ నొక్కుడు బిళ్ళను నా బ్లాగులో చేర్చాను. ఓ వెయ్యి మంది వచ్చి చూస్తారేమో ఇవాళ చూసి రేపు తొలిగిస్తాను. ఇలా రాసి మిమ్మల్ని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. దీనివల్ల నేను నొచ్చుకున్నాను అని చెప్పడమే ! మరో సారి ధన్యవాదాలు.
ReplyDeleteప్రతి శబ్దమ్ లో నీ అడుగుల అలికిడి వెతకలేక నా చెవులు అలుస్తున్నాయి....
ReplyDeleteచాలా బావుంది...ఆత్రేయ గారు :)
అందరూ నీలానే కనిపిస్తారు
ReplyDeleteదగ్గరకొచ్చేదాకా..
beautiful sir !
ప్రణు , పరిమళం గారు ధన్యవాదాలండీ.
ReplyDelete