ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా బిగుసుకుంటాయి..
దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...
అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో స్థిమితాన్ని చెదర గొడతాయి..
అందుకే
గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే
ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ కవనం..
నా కళ్ళలోకి చూస్తావు కదూ.. ?
ఆత్రేయ గారూ, మీ ప్రియురాలి కళ్ళకు గంతలు కడితేగానీ తన హృదయంతో మీ కళ్ళలోకి చూడనందా? :)
ReplyDeleteమీకవితా హృదయాన్ని కనులు మూసుకుని కూడా తను చూడగలదు అనుకుంటాను!!
ReplyDeleteభారారె గారు ధన్యవాదాలు. ప్రాపంచిక నగిషీలతోనూ హంగులతోనూ కనిపించే ఆ ముఖము వెనక, తెల్లగా నిర్మలమయి, వెన్నెలలా చల్లగా ఉండే మరో ముఖము ఉంది, మనసుతో చూస్తే తెలుస్తుంది అన్న భావనతో ఆ చిత్రాన్ని అక్కడ ఉంచాను.
ReplyDeleteపద్మార్పితగారు ధన్యవాదాలు. నేనూ అలానా అనుకుంటాను.
chala baagundi
ReplyDeleteనల్లని రంగుల వెనుక తెల్లని హృదయం.. బాగుంది మీ వివరణ
ReplyDeleteకనులలో నీ హృదయం
ReplyDeleteకనుగొనగలదు మరో హృదయం
మరి ఆ మనసే లేని చోట
ఏ భాష తెలిపేను తన మనసు?
సౌరభాల కబురంపేవు
అందుకున్న మది స్పందించేనా?
tappakunDa cUstAru. bAvundanDi. :)
ReplyDelete"దొర్లని పదాలు.. దొరకని బాసలు
ReplyDeleteచిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి..."
Entha bAgA rAsarandi ee rendu padalu. Very nice. It was an experience reading it !
సుజ్జిగారు, భారారె గారు ,శృతి గారు, వంశీ ధన్యవాదాలు.
ReplyDeleteత్రినాధ్ గారు చాలా రోజులకి కనిపించారు. ధన్యవాదాలు. మీకవితలు తరుచు చూస్తూనే ఉన్నాను చాలా బాగుంటాయి. మరో అనువాదం చేయడానికి సమయం దొరకడంలేదండీ.. వస్తూ ఉండండి.