Wednesday, May 27, 2009

మరో బ్రతుకు చిగురిస్తుంది


బరువయిన గుండెను మోసేకంటే
బద్దలయితే ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది...

ముందుకొచ్చిన మౌనంతో
కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది...

స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే
ఎందుకో సుఖమనిపిస్తుంది..

సడిచేసే గుండెలో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
ఆశా సౌధాలుజేరే సోపానాలు లేక
అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది.

ఇది నిజం..
ఆ వేదన ఏరులై పారనీ.. ఆ ప్రవాహమాపకు ...

ఆ తరవాత అంతా
మరో ఉదయంలా ప్రశాంతంగా అనిపిస్తుంది
పారే సెలయేరులా నిర్మలంగా కనిపిస్తుంది..
ప్రతినవ్వులో పసి పాప కనిపిస్తుంది
గుండె లయల్లో సరిగమ వినిపిస్తుంది.
బ్రతుకు తిరిగి మధురంగా అనిపిస్తుంది.

పడటం తేలిక.. పడి ఉండడం మరణం..
లేచినప్పుడే విజయం వరిస్తుది..
మరో బ్రతుకు చిగురిస్తుంది !!


శృతిగారి కవిత "గుండె చప్పుడు కరువైతే ..." కి నా స్పందన
http://manaanubhoothulu.blogspot.com/2009/05/blog-post_26.html

8 comments:

 1. "మరో బ్రతుకు చిగురిస్తుంది" అది అక్షరాలా నిజం. పడిన చోటే నిలువెత్తుగ ఎదగాలి. మరోమారు జీవితం తిరగతోడి బ్రతకాలి. నేనదే చేసాను. ఒకటీ, రెండు ముద్రా రాక్షసాలున్నాయండి [శెలయేరులా -> సెలయేరులా, సరిమ -> సరిగమ]. మీ సమయాభావ పరిస్థితి కాస్త మెరుగైనట్లుందే, బ్లాగ్లోకంలో పునర్దర్శనమిచ్చారు.

  ReplyDelete
 2. avunu. paDi unDaTam maraNam. paDina pratI sArI lEci parigettaDam gelupu. bAvundi. dhanyavAdAlu.

  ReplyDelete
 3. సరిగ్గా చెప్పారు. అనిపించేవన్నీ మనసుకు సంబందించినవే..అందుకే కాబోలు మాకు మీ కవితలు చదివితే నిజాలను తెలుసుకొని ఆహ్లాదమనిపిస్తున్నది.

  ReplyDelete
 4. వసంతం వెంటే గ్రీష్మం ....ఆ వెనుకే వర్ష ఋతువు ....
  రాలిన ఆకులు మళ్ళీ కొత్త చివుర్లు తొడుగుతాయి .
  పడి లేచినప్పుడే విజయం వరిస్తుందని చక్కగా చెప్పారు గురువుగారు !

  ReplyDelete
 5. బరువయిన గుండెను మోసేకంటే
  బద్దలయితే ఆ ముక్కలేరుకోవడమే
  ఒక్కోసారి సుఖమనిపిస్తుంది


  చాలా బాగా చెప్పారు..బద్దలయ్యాక కూడా అద్దంలాగా దాని సహజ స్వభావం ని మార్చకూడదు అప్పుడే అది అమరం అవుతుంది ..

  ReplyDelete
 6. నాకైతే నా ఆటోగ్రాఫ్ సినిమా లో పాట గుర్తుకువచ్చింది చదివినతర్వాత ..ధన్యవాదాలు

  ReplyDelete
 7. ఉష గారు తప్పులు దిద్దినందుకు ధన్యవాదాలు. ఇంకా పరిస్థితి పూర్తిగా బాగవలేదండి.. చూశారుగా హడావిడిగా రాస్తే ఇలాగే ముద్రా రాక్షసులు దండెత్తుతారు.

  వంశి ధన్యవాదాలు.

  భారారె గారూ మీరూ ప్రజెంటన్నమాట. నెనరులు.

  వర్మగారు ధన్యవాదాలు.

  పరిమళంగారు ధన్యవాదాలు.

  హరేకృష్ణ గారు స్వాగతం. మంచి పాటను గుర్తుచేశారు. ధన్యవాదాలు.

  ReplyDelete