ముఖాన పచ్చపోసుకున్న
ఆ పన్నెండు మైలు రాళ్ళేగా
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా..
ఐనా అవి దాటిన ప్రతిసారీ
నా గుండెలవిసేలా అరచి మరీ చాటింపేస్తావు
వెనక బడ్డ నన్ను చూసి గేలిచేస్తావు
నీ పరుగుకు మూడు కాళ్ళు ..
మరి నాకూ.. ఎన్ని అడ్డంకులేస్తావు ?
ఎందుకెగతాళి చేస్తావు ?
నేనే లేనప్పుడు, నీకస్థిత్వమేదీ ?
నా బ్రతుకంతా నిన్ను నింపుకున్నానే
నువ్వు నాకిచ్చేదేమిటి ?
ప్రమేయం లేకుండానే జారిపోతావు..
ఆపడానికెన్ని చేశాను ?
నిన్ను గోడకు శిలువేశానే ..
ఐనా అవిశ్రాంతంగా.. నా బ్రతుకు బాట వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు..
గమ్యం కానరాకుండా..
ముందు మలుపులు తిప్పుతూనే ఉంటావు.
దాటిపోయేదాకా .. వెనకున్నావని తెలియదు..
నా ఓటమే.. నీ గెలుపుకి సాక్షి.
ఈ ఆట ఏకపక్షంగా లేదూ..?
నీది గెలుపెలా అవుతుంది ?
ఆట ఏక పక్షమైనా అలుపెరుగని పయనంలో ఎప్పుడూ కాలం చేతిలో మనిషికి ఓటమి తప్పటం లేదు .
ReplyDeleteఆట ఏకపక్షం కాదు
ReplyDeleteనువ్వే నాకు పోటీ రావడం లేదు
అనాలని ఉంది కాని అనను
ఎందుకంటే నీ ఊహలు, ఊసులు
నాకందనంత వేగం
అయినా హనుంతుడి ముందు
హైజంపులా? వద్దు
నువ్వు లేని ఉనికి
నాకెంత భారమో నీకు
తెలియదా నేస్తం. నిజం చెప్పనా
నీ ముందు వెనుకలు
నేనున్నానని కించిత్ గర్వం
అంతలోనే సమున్నతంగా ఎదిగే
నీ వ్యక్తిత్వం చూసి భయం.
నిజం. నీతో పోటీ నా కిష్టం.
మీతో పోటీనా కలలో కూడా జరగదు...
ReplyDeleteజరిగినా గెలుపు మాత్రం మీదేనండి......
శృతిగారు అదరగొట్టారుగా.. అభినందనలు. పరిమళంగారు నిజంచెప్పారు ఓటమి ఎప్పుడూ మనకే !. పద్మార్పితగారు కాలంతో కయ్యానికెళ్ళి ఎవరుగెలిచారు చెప్పండి.. ఐనా అభిమానానికి ధన్యవాదాలు.
ReplyDelete