ప్రమిద క్రింద చీకటిలా
దోబూచులాడుతూ ..
ఆ నీడన స్థిరత్వం వెదుక్కుంటూ..
సెలయేరులో గులకరాళ్ళలా
ఒదిగిపోయి.. కాలంతో కోసుకుపోతూ
మృదుత్వం మొహాన పులుముకుంటూ..
రహదారిలో మైలురాయిలా
నిస్వార్ధంగా.. దారి చూపుతూ ..
చేతనలుడిగి పాతుకుపోతూ..
ఒకదానికొకటి తోడుగా.. ఎప్పటికీ..
ఐనా..ఎన్నటికీ కలవని బంధాలవి ...
మనలానే !!
అవును మనలానే మనదరిలానే కలవని బంధాలవి.. ఐనా తోడుగా ఉంటూ...
ReplyDelete:) అంటే, మీ కవిత చదివానన్నమాట
ReplyDeleteకలవని బంధాల్లో
ReplyDeleteబాంధవ్యాన్ని వెదుక్కుంటూ
ఆశను వీడక ....
ఒకదానికొకటి తోడుగా
సాగిపోవడమేగా జీవితం
వంశీ గారు, భారారె గారు, పరిమళం గారు ఇటుగా వచ్చి కామెంటినందుకు ధన్యవాదాలు. సమయాభావంవల్ల బ్లాగులో గడపలేక పోతున్నాను... క్షమించాలి..
ReplyDeleteaatreayagaaruu! present Sir!
ReplyDeleteఒక్కోసారి చదివిన తరవాత, కవిత మనలో నింపిన ఆలోచనలతో.. వ్యాఖ్య ఏమి రాయాలో అర్ధం కాదు... మాటలు కూడ దీసుకుని బాగా రాసారు అని చెప్పాలనిపిస్తుంది, నాకు ఇంకా ఏదో చెప్పాలి అనిపించినా... అంత కన్నా చెప్పలేను... మొదట్లో మీ కవితలకన్నా ఈ మధ్య కవితల్లో జీవన రాగం ప్రతీ పదంలో పలుకుతుంది.
ReplyDeleteతెలియదుగా ముందే
ReplyDeleteజత కలవని అడుగులని
తెలిసినా మరి ఆగదుగా
మనసు పరుగులెత్తడం
అయినా కలయని బంధాలలోనే
తెలియని అనుబంధమేదో
పెనవేసుకుందేమో?
మీరు వేరే కలం పేరు పెట్టండి.మీ ఇడెంటిటీ మీకుంటుంది కదా.మీకు చెప్పే అంత దాన్ని కాదనుకోండి.అలాగే వివిధ పత్రికలకి,జాల పత్రికలకి పంపిస్తూ వుండండి.
ReplyDelete@రాధిక ఆయన కలం పేరే కాదు అసలు పేరు కూడా మార్చేసినట్టున్నారు, ఓ సారి అలా ప్రొఫైల్ చూడండి. భారద్దేశం వచ్చి వెళ్ళినట్టున్నారు. మన గోదావరి ఎలా ఉందో సెప్పనే లేదు.
ReplyDeleteఅవునండీ వేరే కలం పేరు పెట్టుకోండి...
ReplyDeleteరాధిక గారు, దిలీప్ గారు ఆత్రేయగారి పరువు తీస్తున్నాను అంటారు. ప్రొఫైల్లో ఆయన చిత్రాన్ని తొలగించాను. ఇక నాపేరంటారా.. అది మార్చలేను :-).
ReplyDelete