Wednesday, April 22, 2009

విలవిలలాడేం లాభం ?


విరిగిన బంధం విలువెరిగి
చెంపల గీతలెన్ని తుడిచినా
ముడులు బిగవవు.

పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.

వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.

జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయమారదు.

అందని కోర్కెల తీపెరిగి
ఎంతో కాలం ప్రాకులాడినా
అంత మగుపడదు.

అంతా వీడిన ఆవల
విలవిలలాడేం లాభం ?

12 comments:

  1. కవిగారు ఎవరి గురించో విలపిస్తున్నట్టున్నారే !!!

    ReplyDelete
  2. వేళ్ళ మధ్యనుండి జారుతున్న ఇసుక
    చేజారిన కాలాన్ని తలపింప చేస్తోంది
    కవితకు తగ్గ చిత్రమో ......లేక
    చిత్రానికి తగిన కవితో ....మరి !

    ReplyDelete
  3. బారారె గారు నిజమేనండి. ఇదేదో హైదరాబాదులో చేసిఉంటే అక్కడ నీళ్ళ కొరతైనా తీరేది. మబ్బులు వెళ్ళి వెళ్ళి సముద్రంలో కురిసినట్టయింది పరిస్థితి. నాగోడు న్యూయార్కుదాకా వినబడినందుకు ఆనందంగా ఉంది. ఇటుగా వచ్చి కుశలమడిగినందుకు ధన్యవాదాలు.

    పరిమళంగారు మంచి పరిశీలన చేశారు. "నీదన్నది ఏదీ లేదు. నీచేతిలోదీ నీదికాదు.. అన్నీజారిపోయేవే.. అలాంటప్పుడు విలవిలలాడడం ఎందుకు ?" అన్న సందేశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ఇది కవితకు వెదికిన చిత్రమే..

    పద్మార్పిత గారు ధన్యవాదాలు. మీ బ్లాగులో నావిమర్శని సహృదయంతో తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఆ భావం నాకెప్పటినుంచో ఉంది. కానీ చెప్పడానికి ధైర్యం చాలలేదు.

    ReplyDelete
  4. ఆత్రేయ గారు,

    జెర్సి సిటి దరిదాపులనుంచి , న్యూయార్క్ దగ్గరే కదా!!! అందుకు గట్టిగానే వినపడింది

    ReplyDelete
  5. హహహ సారూ బారారె గారూ బాగానే బాదారే !!
    అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని సామెత. బాగుంది.

    ReplyDelete
  6. ఆత్రేయ బాసూ ఖూనీ చేసావ్ బాసూ
    భారారె, బారారె కాదు. దయవిట్టు స్వల్ప నోడి

    ReplyDelete
  7. రామరాజు గారు నిజమే.. తప్పుచూపినందుకు ధన్యవాదాలు. ఇంతకీ దయవిట్టు స్వల్పనోడి అంటే ఏమిటో ?.. బహుభాషాకోవిదులు మీరు.. తెలుగే సరిగ్గా రాని వాడినినేను (చూశారుగా.. ) ఆ చెమక్కర్ధంజెప్పరూ..

    భారారె గారు మీ పేరును తప్పుగా రాసినందుకు క్షమించగలరు.

    ReplyDelete
  8. ప్రతీ పారా లో నిజముంది. బావుంది. నాకెందుకో pic నప్పలేదని అనిపిస్తుంది.

    ReplyDelete
  9. వంశీ గారు కవిత వదిలిన ప్రశ్నకు ఆ చిత్రం ఓ సమాధానం.. అన్ని సమాధానాలు మనకు నప్పవు/నచ్చవు. ప్రతి పేరాలో ఎంత నిజముందో.. ఆ సమాధానంలోనూ అంతే నిజముంది. అది ఏ సమాధానము అన్నది మీకే వదిలేస్తున్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. ఇన్నేసి కవితలు ఎలా రాస్తున్నారండి బాబూ.మీకు జోహార్లు.

    ReplyDelete
  11. రాధిక గారు ఆహా మనదేశం గాలి ఇటుగా మళ్ళించారన్న మాట ధన్యవాదాలు. భావాలకి బంధాలుంటాయా.. భాషకు హద్దులుంటాయా చెప్పండి ? ఏదో దేవుడి దయ మీ అందరి అభిమానం.. ఇలా నడుస్తుంది..చాలా సంతోషం మీరు ఇటుగా వచ్చారు మరి మాకేం తెచ్చారు ?(అదేనండీ.. కామెంటు కాక :-) )

    ReplyDelete