Monday, April 6, 2009

వాన



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

7 comments:

  1. చిన్న కవిత తమకంలో ముంచింది. ఎంతో బావుంది

    ReplyDelete
  2. నీటి దారాలతో beautiful

    ReplyDelete
  3. కురిసే చినుకుల తడికి
    తడిసి చేరాం మీ కవితల నీడకి .....

    ReplyDelete
  4. ఆత్రేయ గారు,

    "నీటి దారాలతో........" "నీటి కిరీటాలు....." "చిన్న పిల్లల్లా ఉనికి చాటడం......" ఎంత బావున్నాయో........ముఖ్యంగా నీటి దారాలతో నల్ల గాలి పటాలు ....ఓహ్!

    నా బ్లాగులో పెట్టేసుకుంటున్నాను మీ కవిత ఇక్కడ (http://nemechchinaraatalu.blogspot.com/2009/04/blog-post.html)......కాపీరైట్ హక్కులన్నీ మీవే....అభ్యంతరం లేదు కదా?

    ReplyDelete
  5. చినుకులతో పాటు తెలియకుండా తాకే చల్లగాలి ఉనికిని
    ఇంతందంగా చెప్పిన మీకు జోహార్లు...

    చాలా ఆలస్యంగా ఇక్కడికి వచ్చానన్నమాట.
    చదువుతున్న ప్రతీ కవిత కొత్త గా ఉంది...

    ReplyDelete
  6. వంశీ, బాబా గారు, పరిమళం గారు ధన్యవాదాలు.
    భావకుడన్ గారు తప్పకుండా చేర్చుకోండి.. ధన్యవాదాలు.
    చందమామ గారు, నిషిగంధ గారు స్వాగతం ధన్యవాదాలు.

    నా కవిత నచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ.. ఈ వానకు ఓ తాత్విక అర్ధం ఉంది. అది ఎవరికీ అందినట్లు లేదు.. వేరే పోస్టులో వివరిస్తాను.

    ReplyDelete