నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల
నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు
జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.
చిన్న కవిత తమకంలో ముంచింది. ఎంతో బావుంది
ReplyDeleteనీటి దారాలతో beautiful
ReplyDeleteకురిసే చినుకుల తడికి
ReplyDeleteతడిసి చేరాం మీ కవితల నీడకి .....
ఆత్రేయ గారు,
ReplyDelete"నీటి దారాలతో........" "నీటి కిరీటాలు....." "చిన్న పిల్లల్లా ఉనికి చాటడం......" ఎంత బావున్నాయో........ముఖ్యంగా నీటి దారాలతో నల్ల గాలి పటాలు ....ఓహ్!
నా బ్లాగులో పెట్టేసుకుంటున్నాను మీ కవిత ఇక్కడ (http://nemechchinaraatalu.blogspot.com/2009/04/blog-post.html)......కాపీరైట్ హక్కులన్నీ మీవే....అభ్యంతరం లేదు కదా?
చినుకులతో పాటు తెలియకుండా తాకే చల్లగాలి ఉనికిని
ReplyDeleteఇంతందంగా చెప్పిన మీకు జోహార్లు...
చాలా ఆలస్యంగా ఇక్కడికి వచ్చానన్నమాట.
చదువుతున్న ప్రతీ కవిత కొత్త గా ఉంది...
Beautiful!!
ReplyDeleteవంశీ, బాబా గారు, పరిమళం గారు ధన్యవాదాలు.
ReplyDeleteభావకుడన్ గారు తప్పకుండా చేర్చుకోండి.. ధన్యవాదాలు.
చందమామ గారు, నిషిగంధ గారు స్వాగతం ధన్యవాదాలు.
నా కవిత నచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ.. ఈ వానకు ఓ తాత్విక అర్ధం ఉంది. అది ఎవరికీ అందినట్లు లేదు.. వేరే పోస్టులో వివరిస్తాను.