Friday, April 3, 2009
ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ...
ఏకాకి నా బ్రతుకు ఎదురు చూసే తోడు
ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ... !!
తడికళ్ళలో నువ్వు తాండవిస్తున్నావు
తపన తెలిసీ నువ్వు తళుకు మంటావా.. ?
ఆశలుడిగిన మనసు అట్టుడికి పోతుంటె
రగులు జ్వాలలు చూసి జారు కుంటావా .. ? ... ఏకాకి
చింత సమయాల్లోన చెక్కిళ్ళు తడిపేసి
చెంత నిలవక నువ్వు చేజారి పోతావా .. ?
నీదాన్ని నేనంటు నాలోనే దాగుండి
ఎద కోరు సమయాన ఎగిరెళ్ళి పోతావా .. ? ... ఏకాకి
ఎండిపోతూ మనసు బీటలై పోతుంటె
ఎదురుచూపుల్లోన అడ్డమై నిలిచేవా .. ?
రెక్కలిరిగిన మనసు రేగడై పోయాక
చెక్కిళ్ళ తలముపై చిందుల్ని వేస్తావా .. ? ... ఏకాకి
ఎన్నాళ్ళ కొచ్చావే నా కళ్ళ నీరూ...
కాసేపు నాతోటి ఊసాడి పోవూ..?
నా బాధ కాస్తన్న కరిగించి పోవూ..? ఏకాకి
Subscribe to:
Post Comments (Atom)
భలే ఉంది పాట..
ReplyDeleteబావుందండీ !ఒక్క బొట్టైతేనేం ...కరిగి జారి ,గుండెను చల్లబరిచే కన్నీటి విలువ వెలకట్టలేనిదండీ ...
ReplyDeleteమీకు శ్రీ రామనవమి శుభాకాంక్షలండీ !
అవును ఆత్రేయ గారు, ఎందుకు మనకా కన్నీరంటే అంత మక్కువా అని నేనూ పలుమార్లు ప్రశ్నించుకుంటాను. సమాధానం ఎపుడూ కరువే? వస్తాయి, వూసులు వింటాయి, తిరిగి ఆశలు రేపుతాయి. పిలిచామని రావు, అడిగామని పోవు. వాటికవే వస్తాయి, వెళ్తూ మాత్రం వేదన వెంటబెట్టుకు పోతాయి. అందుకే నా కంటి చెలమల్లో అవి సజీవ చలనాలు, నా వునికికి వూపిరులు. వెరసి నా శోకం వూటబావి, నా లోకం కన్నీటితో లిఖించే కావ్యం.
ReplyDeleteఉష గారు ధన్యవాదాలు. వెళ్తూ వేదన వెంటబెట్టుకు పోతాయి.. బాగా చెప్పారు.
ReplyDelete