Friday, March 27, 2009

జ్ఞాపకాలు


నిన్నకి నేటికి మధ్య సన్నని
చీకటి సందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
కందిరీగల్లా కమ్ముకున్నాయి

గతపు తోటలు ఎన్ని తిరిగొచ్చాయో
మధుర ఘటనలు ఎన్ని తరచి వచ్చాయో
అధర సుధలతో నిదుర తుట్టెను
నింపుతూ తమకంగా తిరుగు తున్నాయి

2 comments:

  1. Dinnela Krishna KumarMarch 27, 2009 at 5:35 PM

    యాండోయ్

    నిన్నకి నేటికే జ్ఞాపకాలు పాతడిపోతే ఎట్టా మారాజా? కందిరీగలంటావు దొర, తుట్టెమీదెక్కాయంటావు దొర, రెప్పలంటావు దొర! కందిరీగలకి తమకమెక్కితే ఏటవుతాదో తెలుసా మారాజా, కిర్రున కర్రెక్కి కసుక్కున కత్తుచ్చుకుంటాయి కదోండీ. ఆ మీన అధరాలేటి, నిదరాలేటి, ఆపైన రెప్పలేటి అన్ని వాసి ఊర్కోడమే. ఉత్తుత్తినే అన్నా గానీ, పదాలు మంచి మత్తునిచ్చాయి మారాజా.

    ReplyDelete
  2. యాండోయ్ ఈరోజు నల్లనయ్యంగూడ ఇరకెట్టేరు పేర్ల . దిల్లు గరమయ్యిందయ్య. అయ్యి పాత జ్ఞాపకాలే దొర. నిన్న, నేడన్నది రాత్రి మాట చెపాగ్గాదె ? నిజం జెప్పిండ్రయ్య.. కిర్రుకిక్కెక్కి కత్తిచ్చుకున్నాయిగా నాకళ్ళు వాచాయయ్యోయ్.. నాకైతే యాపీనే మీకు మాతాయితొచ్చింది, ఓ సీసాలేపే పనైతె లేదు. మరుంటా నయ్య మామంచి రాజా .. దుకాన్నాన్కెల్లి గోలీల్గొనిదేవాల్నే !!.. మల్రామారాజ.. అదేనే.. మాపిటికి మత్తుదిగినాంక.

    మీకు విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete