Thursday, March 19, 2009

దేవుడెక్కడ ?



ప్రపంచమేలే ధరణీ నాధుడు
కొండ బండలో నాకగుపడరాడు

పాపం పుణ్యం ఎరుగని పాపడు
ఫక్కున నవ్వి పళ్ళికిలిస్తూ
ప్రక్కన చేరి కన్నులు కలిపితే
అప్పుడగుపడుతాడేఈశ్వరుడైనా ..

చక్కగ తలపై లాలబోసుకుని
తుడిచే తలను నిలపక తిప్పుతు
ఆ బుజ్జి చేతుల పికబూ లల్లోనే
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

గోడబట్టుకుని నిల్చుట నేర్చి
ఒడుపును విడి చతికిల బడి
ఆ బుంగ మూతి దొంగేడుపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

తపతప మని అడుగులు వేస్తూ
త్వరగా పరుగిడి బోర్లా పడి
తిరిగిలేచి విసిరే గర్వపు చూపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..


తప్పని నరకము బ్రతుకున గంటూ
అమ్మా అన్న ఆర్తి పిలుపుకు పరుగున వచ్చి
తలనొడిలో చేర్చి నిమిరే కంటిలొ
రాలేచుక్కలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ఆకలి కడుపులు ఎండిన రొమ్ములు
బువ్వడిగే ఓపికలేక..లోతుకళ్ళతో లోకంచూసే
బీద తల్లికి అన్నం పెట్టి అక్కున చేర్చే
ఆ ఆగంతకుడిలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ప్రేమ పంచన, ప్రకృతి అంచున
ప్రాగ్దిశ ఝామున, పశ్చిమ సంధ్యన
పాప నవ్వులో విరిసిన పువ్వులో
కరిగిన గుండెలో, తడిసిన కంటిలో
అగుపడుతాడేఈశ్వరుడైనా
..

ఎక్కడ లేడని.... కానీ..
నాకగుపడేదా చెప్పిన చోట్లే ...

7 comments:

  1. చాలాబాగుందండి,శుభాకాంక్షలు

    ReplyDelete
  2. ఆత్రేయ గారు.. నవరస కవితా సార్వబౌముడులా వున్నారే ?
    నిన్న కత్తి నెత్తురు అంటూ వీరంగమేశారు. మొన్న వానంటూ
    ముత్యాలు కురిశారు.. అంతకు ముందు సంగీతంలో కన్నీళ్ళు చూశారు... ఇలా అన్ని రసాలనూ కవితల్లో గుప్పించగల వారిని ప్రస్తుతానికి బ్లాగులోకంలో మిమ్మల్నే చూస్తున్నాను. మీ కవితా ప్రవాహాన్ని ఒక చోట నిలబడి చదవి. స్పందించే లోపు మరో అల.. మరొ వెల్లువ.. మరో భావం. ముణగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కొనసాగించండి.. God bless u ..

    ReplyDelete
  3. పాపం పుణ్యం ఎరుగని పాపడు
    ఫక్కున నవ్వి పళ్ళికిలిస్తూ
    ప్రక్కన చేరి కన్నులు కలిపితే
    అప్పుడగుపడుతాడేఈశ్వరుడైనా ..

    తెల్లవారుఝామున 3గం. లేచి నవ్వుతూ ఆడుకుంటున్న మూడునెలల మనవడిని ఊయలలూపే పని నాకప్పగిస్తే వచ్చీరాని వటపత్రశాయి పాట పాడుతూవుంటే పాటభావముతో పసివానిముఖంలో భగవంతుడు ద్యోతకమయ్యాడు.net లోకి వస్తూనే మీ దేవుడెక్కడ కవిత ప్రత్యక్షం.ఇది కాకతాళీయమా ? లేక ?

    ReplyDelete
  4. చాలా బాగుంది ఆత్రేయ గారు. అభినందనలు

    ReplyDelete
  5. adbhutam gaa vundi mI kavita..I madya nakO bad habit vaaccindi...calm gaa cadivesi vellipOvatam..kaani mI I kavita nannu kaTTi paDEsindi...ekkaDikeltaavu? anTU......comments patte daaka vadalledu..:)

    thanks inta manci kavitalu makandistunnanduku...:)

    ReplyDelete
  6. అజ్ఞాత గారు సరిగ్గా చెప్పారు ...నా మనసులోని మాటను ...

    ReplyDelete
  7. అజ్ఞాత గారు పరిమళం అలా చెట్లెక్కిచ్చకండి..రెండు కారణాలు.. నాకు ఎత్తులంటే భయం. రెండోది, చిన్నప్పటినుంచి చెట్లు దిగటం రాదు. అసలు పైకి ఎలా వెళ్ళాను ? దానికి రెండు కారణాలు. ఒకటి మీలా ఎవరన్న ఎక్కిస్తేనూ.. రెండోది ఏ కుక్కో వెంటబడ్డప్పుడు... నా కవితలు మీకు పిచ్చ పిచ్చగా నచ్చేసినందుకు మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

    జయచంద్ర గారు, ఉష గారు చాలా సంతోషం మీరు ఇలా వచ్చి అభినందనలు తెలిపినందుకు.

    విజయమోహన్‌ గారు.. నిజమేనండి ఇలా కాకతాళీయం గా.. మన జీవితాల్లో ఎన్ని జరుగుతాయో.. వూడూ అనిపిస్తాయి .. మీ చిన్న వాడికి నా బ్లెస్సింగ్స్‌... మీకు ధన్యవాదాలు.

    ప్రణు.. ఏమ్మా . తీరిక దొరికిందా..? ఈసారినుంచి ప్రతి పోస్టుతో పాటు కాస్త ఫెవికాల్‌ కూడ పంపుతా.. మిమ్మల్ని కట్టిపడేయడానికి... లేతే తప్పించుకు తిరుగుతారా..?
    సందేశాలు పంపినా ఇటుపక్కకి రారా... అమ్మా.... ధన్యవాదాలు ప్రణవి...వస్తూ ఉండండి.

    ReplyDelete