మూర్తిగ మలిచే అతనిని చేరి
తనకు తానుగా తనకర్పించి
ఉలి దెబ్బలను తనువున ఓర్చి
సగమే కరిగిన ఆ శిలలను చూస్తే
తొలిగిన ముక్కల గుట్టల మధ్యన
విరిగిన గుండె పెంకులు కనిపిస్తాయి
బండలయిన తన ఆశలు కనిపిస్తాయి
కరిగిపోయిన తన కఠినత అగుపడుతుంది
దయనీయమయిన ఓ స్థితి కనిపిస్తుంది.
తనుచేసిన తప్పిదం తనకే తెలియదు
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
బండగా తన బ్రతుకంతమవుతుందని,
ఆశగ చేరిన ఆ కొండ రాయి, ఇపుడు
బండా కాదు. శిల్పమూ కాదు.
అనుకున్నట్టుగ అంతా జరిగితే
అర్చనలందుతు హారతులందుతు
అభిషేకాల్లో మునిగి తేలుతూ
ఇలవేలుపుగా ఇడుములు దీర్చుతు
ఏగుడిలోనో కొలువుండేది.
ఏపాపమెరుగని ఆ శిల, అదిగో
దుమ్ము ధూళుల అభిషేకాల్తో
మండుటెండల హారతులందుతు
చూసే నాధుడు కరువై పోయి
రెంటికి చెడిన రేవడి నేడు.
భువిలో..
అసలా అర్హతలున్న శిలలు ఎన్నో
సగమే మలిచిన శిల్పాలెన్నో
బండగ మిగిలిన గుండెలొ ఎన్నో
పూజలు అందే మూర్తులు ఎన్నో
వేల్పుగా వెలగవలసిన సుందరమూర్తిని
ReplyDeleteరెంటికి చెడ్డ రేవడి చేయుట ......
శిల్పి చేసిన మానవ తప్పిదం .....
కాని
బ్రహ్మ చెక్కిన శిల్పాల్లోని లోపాలు
వైకల్యాలై వేధిస్తుంటే ....
మీ జీవితమింతేనని నుదుట వ్రాసి
వేడుక చూస్తున్న విధాత చేసిన తప్పు
వారి తల్లితండ్రుల పాలిట శాపం .
ఆత్రేయ గారూ ! మీకవిత మానసిక వికలాంగుల స్కూల్ కి వెళ్ళినప్పుడు నాలో కలిగిన భావోద్వేగాన్ని గుర్తుచేసింది .
కవిత చాలా బావుందండి. బ్రహ్మ చేత సగం చెక్కబడిన సిల్పాలెన్నో
ReplyDeletemi sunishita drusti ki abhinandanalu...avunu..cheyani tappu ki siksha aa annattu ala vundipoyae shilaapalu konni...
ReplyDeletemi abhimaanaaniki thanks aatrya garu..mi kavitalu cadive chance miss chesukonu...vastuuuuuuuuuuu ne vuntaa :)
సాక్షాత్తూ ఆ పూరీ జగన్నాధుడికీ తప్పలేదు కదా ఆత్రేయ గారు ఈ అవస్థ. కానీ భక్తుల జనస౦దోహ౦ చూడ౦డి. మనుషుల్లాగే మీరు చూసిన శిలలు కూడానూ. అదృష్టవ౦తులు కొ౦దరు. వడ్డి౦చిన విస్తరి వారిది. సగ౦ చెక్కబడిన శిల్పాలన్నీ మీ కవితాఉలితో పూర్తి చేసి జీవ౦ పోసారు. శుభాకా౦క్షలు మీలోని కవికి.
ReplyDeleteస్పందించిన పరిమళం గారు, జయచంద్ర గారు , ప్రణు, ఆనంద్ గార్ల కు ధన్యవాదాలు.
ReplyDelete