Wednesday, March 18, 2009
కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
ప్రక్కన నక్కిన పిశాచిమూకలు .
తేనెలు పూసిన నెత్తురు కత్తులు
జిత్తులు నిండిన అత్తరు మూటలు ..
నేతలు.. మన నేతలు ... ..
దేశపు భవితను అడుసులొ తొక్కి
వేదన బ్రతుకులు మడుగులొ దించి
భూములు మింగి భోగాలందే ..! కుక్కలు .. నక్కలు.
ప్రణాలికలన్ని ప్రచురణ కొరకే
ప్రచారమంతా పరపతి కొరకే
ప్రజాపావులివి ప్రయోగపెలుకలు..!
వాగ్దానాలకు హద్దుల్లేవు
వాగ్యుధ్ధాలకు అదుపుల్లేవు
అశ్లీలమశుధ్ధమసభ్య చేష్టల ! కుక్కలు .. నక్కలు.
నిజాయితీ అది తెలియని మాట
ప్రజాసేవ అది మరచిన మాట
జనాలు కొంటూ.. దేశాన్నమ్ముతూ..! కుక్కలు .. నక్కలు.
మగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..!
తూర్పు కొండపై రుధిర జ్వాలలు
నింగిన చిందిన సింధూరాలు
పరుగులు తీసే చీకటి చేష్టలు..
సాక్ష్యాలివిగో.. సాక్ష్యాలివిగో.. ..! కుక్కలు .. నక్కలు.
ప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..! కుక్కలు .. నక్కలు.
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ శ్రీ గారు గుర్తొచ్చారండీ !
ReplyDeleteకుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
ReplyDeleteవస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..!
ఆశగా ఎదురుచూస్తూ....
వచ్చే రాజుకు స్వాగతమంటూ
ReplyDeleteనేను సైతం తోడవుతానని
పలికింది ఓ మది.
బాగుంది
ReplyDeleteఆత్రేయ గారు,
ReplyDeleteప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..
చదువుతుంటేనే మనసు ఆనందమయమై పోతోందే, మరి ఆయన నిజంగా వస్తే....? అటువంటి వాడొకడు రావాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.
నిజమే గాంధీలు, మండేలాలు వచ్చి దేశాన్ని మార్చగలిగిన సమయం దాటి పోయిందేమో. పరశురాముడి లాంటి వాడు వస్తేనే పని జరుగుతుందేమో మరి
sri sri garu gurtochAru. Ayana rAsina gantalu gantalu kavita.. english lo bells anukuntaa.. wordings bavunaayi.. thanq
ReplyDeleteVamshi
పరిమళం గారు. వంశీ గారు.. శ్రీశ్రీ గార్ని తలపింపచేయగలిగితే కవిత ధన్యవయినట్టే. అభివాదాలు.
ReplyDeleteవిజయమోహన్ గారు, శృతి గారు, 12 గారు (మీ పేరు తమాషాగా ఉంది), పిచ్చబ్బాయిగారు (మీపేరేమిటో ఇప్పటికీ తెలియలేదు) మీ స్పందనలకు నెనరులు.
Atreya garu, chaala baagundandi kavita! :)
ReplyDeletemaadhav gaaru dhanyavaadaalu.
ReplyDeleteprErana iccE laa vundi mi kavita...manci vUpu vundi..cadivaka oka aaSa kaligindi...manci rOjulu vastaayani..
ReplyDeleteఆత్రేయ గారు, నాకు కూడా శ్రీశ్రీ గారి ఋక్కులు గుర్తొచ్చాయ౦డోయ్.
ReplyDeleteమగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..!
నేరాసిన ఓ కవితలోని మాటలు ఇవి.
నిస్సత్తువ విడువరా, శుభోదయమ్ముగా౦చరా.
చీకటిలో నిద్ర నీ మెదడు శక్తినే౦చేసి౦దో చూసావటరా?
తృప్తి అనే క్షుద్రమా౦త్రికుడి చేతిలోఉ౦దని తెలియలేదురా?
నీ అనుమతి లేనిదే నీ శక్తిని దోచే దమ్ము ఎవరికు౦దనిరా.
అగ్నిజ్వాలల శక్తి నీది, పోయి మా౦త్రికుడిని దహి౦చిరారా.
నడక వదలరా, కెరటాల పరుగు త్రోవన ఉరికి చూడరా.
ఏది ఆచారము, మరేది సా౦ప్రదాయమ్మురా?
నీ గు౦డె నమ్మినదాన్ని మి౦చిన భగవద్గీత ఏదిరా?
బ్రహ్మకాలములో నీబ్రతుకు క్షణభ౦గురమేలేరా.
నీదేకాని జీవిత౦లో నీదియ౦టూ లేనేలేదు వినరా.
ఇ౦కా చాలా ఉ౦దిలె౦డి. మీ కవిత మాత్ర౦ ఆపాదమస్తక౦ మహా అర్ధవ౦తము.
ప్రణు ధన్యవాదాలు.
ReplyDeleteఆనంద్ గారు మీ కవిత కూడా బాగుంది.. మీ బ్లాగులో వెదికి మొత్తంగా చదువుతాను. ధన్యవాదాలు.
Shabda Vegam, anupraasa yukta laya, Parashu Ramuni prateeka ... ee moodintilo shree shree sthaayiki chaala daggaragaa vachchaaru. abhinandanalu !
ReplyDeleteబాగుందండి.అభినందనలు.
ReplyDelete