Tuesday, March 17, 2009

స్వార్ధ సంగీతం



స్వేచ్చకోసం..
వెదురు గుండెల గాయాపు ఘోషను వింటూ.. 
మధురమంటాం.. వేణు నాదమంటాం..
కన్నులు మూసి ఆస్వాదిస్తాం.

స్వేచ్చకోసం..
గంట లోలకపు బరువు అరుపులు వింటూ .. 
పవిత్రమంటాం .. ఘంటారావమంటాం
చేతులు మోడ్చి ప్రార్ధన చేస్తాం.

స్వేచ్చకోసం..
ఘజ్జలొ చిక్కిన గోళీ కేకలు వింటూ.. 
తలలాడిస్తాం.. రవళులు అంటాం
కదాన్ని కలిపి నాట్యం చేస్తాం.

స్వార్ధంకోసం..
తొలిచిన గుండెల తంత్రులు మీటి .. 
తన్మయులవుతాం .. విణాగానమంటాం
కృతులను చేర్చి కృతార్ధులవుతాం.

స్వార్ధంకోసం..
కాల్చిన తోలును కర్రతొ బాది..
గంతులు వేస్తాం.. ఢంకానినాదమంటాం
గొంతులు కలిపి గీతాలంటాం.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
నిజమే.. కానీ..
వాటి గాయాలకి .. చెమర్చే కళ్ళెన్నీ ?



3 comments:

  1. అలనాటి పుష్పవిలాపమును వింటిని!!!
    నేడు మీ సంగీత వాయిద్య విలాపమును చదివితిని!!!

    ReplyDelete
  2. బాగుంది ఆత్రేయగారు.. ఒకటోసారి చదివి ............???????????????

    రెండోసారి చదివితే మధురందొరికింది.
    మరి తేనె, తేనెటీగలు కుట్టకుండా వూరికే దొరుకుద్దా??

    ReplyDelete
  3. పద్మార్పిత గారు భాస్కర రామి రెడ్డి గారు ధన్యవాదాలు.

    ReplyDelete