Monday, March 16, 2009
ఓదార్పు
చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయినా
అదిరే చుబుకమూ ఒలికిన కళ్ళూ
బృకుటి ముడి వంగిన అధరాలూ
వేడి నిట్టూర్పులు వాడి చూపులూ
గుండె గాధని చిత్రంగా గీస్తాయి ..
భావ కావ్యాలనావిష్కరిస్తాయి..
బాధనూ కనువిందు చేస్తాయి
గొంతు లోతుల్లో గీతాలకు
రాగాలను కూర్చుతాయి..
అవేదనకు అనువయిన
పదాలను వెదుకుతాయి ...
జారిన చినుకులది క్షణికమని..
అవిలేని బ్రతుకు అరుచికరమని..
బ్రతుకు పాఠాలు నేర్పుతాయి !
చూపులు కలిపి సముదాయిస్తూ...
తడిసిన చెక్కిలి చుంబన చేస్తూ..
అక్కున చేర్చి ఆలంబన ఇస్తూ...
తిరిగి చేయనని ఆశ్వాసిస్తూ..
రాలిన కవితను ఆస్వాదిస్తూ..
చేసిన తప్పును దిద్దుకుంటూ..
నేను..
Subscribe to:
Post Comments (Atom)
చూపులు కలిపి సముదాయిస్తూ...
ReplyDeleteతడిసిన చెక్కిలి చుంబన చేస్తూ..
అక్కున చేర్చి ఆలంబన ఇస్తూ...
ఇంతకంటే కావలసింది మరొకటి ఉంటుందా?
కాని
కలిసిన చూపులలో వెక్కిరింతలు ...
తడిసిన చెక్కిలి చూసి కొక్కిరింతలు ...
అక్కున చేర్చుకోవడం దేవుడెరుగు ...
పక్కున నవ్వకుంటే చాలు ...
ఇది కదా నేడు లభిస్తున్నది.
I remember a word
"I need a shoulder to cry".
ఇలా అడిగిన వ్యక్తి నిజంగా ఎంత క్షోభ అనుభవిస్తే ఈ మాట చెప్పరో అనిపిస్తుంది.
రాలిన కవిత మాకాస్వాదనైతే ....
ReplyDeleteఅలిగిన చెలికిది ...ఆలంబన..
శృతి గారికి, పరిమళం గారికి ధన్యవాదాలు.
ReplyDelete