ఆర్ధ్రత నిండిన ఆర్తి పిలుపులకు
సమాధానంగా,
ఆప్యాయంగా చాచిన బాహుదండాల్లోకి
ఆసాంతం వచ్చి చేరిన
నిలువెత్తు శూన్య నిశ్శబ్ద నిశి
ఆలింగనల్లో మనసు ఊరట చెందుతుంది
విశ్రాంతి కోరుతుంది
పరవళ్ళు తొక్కిన భావావేశము
వాస్తవపు కట్ట బంధనాలకు
మూర్కొని బద్దలై
చలన రహితమై, విసిగి వేసారి
వ్యక్త పరిచే శక్తులుడిగి, వివర్ణమై
భాష పొందు మరిచి, చల్ల బడుతుంది
విశ్రాంతి కోరుతుంది
అంతర్ముఖ భాషణలు, ఏకాంత పయనాలు
అబద్ధపు ఆశ్వాసనలు, శోక సంగీతాలు
కవితా నివేదనలు, మనసు కర్పూరాలు
ఒంటి చేతి కరచాలనలు, దోసిలి నిండిన అభ్యర్ధనలు
ఓటమి గెలుపులు.. అంతర్మధనాలు..
ఇలా .. ఎంతకాలం ? నా కవిత
విశ్రాంతి కోరుతుంది..
నేను ఒంటరినే.. నాకు నేనే తోడు కాదు.
అబద్ధపు భావుకత నేను నటించలేను
అందుకే కవిత విశ్రాంతి కోరుతుంది..
మళ్ళీ మనసు స్పందించే వరకు
సెలవు.
నాకు నేనే తోడు కాదు.
ReplyDeleteఅబద్ధపు భావుకత నేను నటించలేను
అందుకే కవిత విశ్రాంతి కోరుతుంది.. వరకు బాగుంది.
మళ్ళీ మనసు స్పందించే వరకు
సెలవు, అని అంటే బాధగావుంది.
పద్మార్పిత గారు ధన్యవాదాలు. అవును నాకూ బాధగానే ఉంది. కానీ మనసు స్పందించ కుండా ఉంటుందా చెప్పండి.
ReplyDeleteమీ కలం త్వరలోనే నిండాలనుకోవడం మా స్వార్ధం అవుతుందేమో ......కాని బాధతో కాదు భావుకతతో .......ఎదురు చూస్తాం .
ReplyDeleteఆత్రేయగారు, మీరిచ్చిన వ్యాఖ్యకు నాస్ప౦దన ఆలశ్యమైన౦దుకు క్షమతవ్యుడిని. నిశ్శబ్ధాన్ని కౌగలిలో దాచగలిగిన మీకు మరో భావావేశపు కవితతో మనసులని ఓలలాడి౦చడానికి మరె౦తో కాల౦ పట్టదులె౦డి. ఎ౦దుక౦టే చప్పుడు ఏదైనా ఆ నిశ్శబ్ధ౦లో౦చే కదా పుట్టాల్సి౦ది. మీ ప్రతి కవితా మీ గు౦డెచప్పుడేగా.
ReplyDeleteమీ కవితలని కొన్ని ఈమధ్యకాల౦లో చదివాను. కాని వ్యాఖ్యను పెట్టే౦త సాహస౦ చెయ్యడానికి మొహమాట పడ్డానో లేక నా ప్రతిస్ప౦దనకు దీటైన పదాల అన్వేషణలో ములిగానో కానీ, మొత్తానికి మీ కవితాహార౦లో దాగిన దారానికి నేను కూడా ఓ చుక్క పెట్టగలిగాను. దీటైన పదాల గురి౦చి మాత్ర౦ అడగక౦డి. ఇప్పటికి ఇ౦త స్ప౦దన చూపి౦చగలిగుతున్నాను.