ఆ మనిషి కోసం వెతికి వేసారి -
జారే కాలం పెట్టే కేకలు,
కలంలో నిండి కాగితాలు నింపుతున్నాయి..
కవితలయి కేరింతలు కొడుతున్నాయి.
అయిదు అడుగుల అద్భుత శిల్పం
ఎదురుగా ఉన్నా.. ఆర్ధ్రత నిండిన
పిలుపులు, ఆసాంతం దూసుకు పోతున్నాయి...
ప్రతి ధ్వని కోసం భూనభోంతరాళాలు వెదుకు తున్నాయి ..
అరవై కేజీల నిశ్శబ్దమై
వెనుదిరిగి వచ్చి చెంత నిలిచి వెక్కిరిస్తున్ది..
హద్దులెరగని ఆరాటం,
పెల్లుబికే భావాలతో కలిసి
నోటికడ్డంగా పద మాలికలల్లుకుని
కవితల ముసుగులో
శుధ్ధ సావేరి ఆలాపిస్తుంది.
అయిదడుగుల శిల్పం కోసం కాదు
అరవయి కేజీల నిశ్శబ్దం కోసం కాదు
చన్దోబధ్ధ కావ్యం కోసం కాదు
ఆర్ధ్రత నిండిన పిలుపుకు
ఆశ్రయ మిచ్చే మనసు కోసమీ ఆరాటం..
చివరి వరకు నా ఈ పోరాటం..
========================================
aa manishi kOsam vetiki vEsaari -
jaarE kaalam peTTE kEkalu,
kalamlO ninDi kaagitaalu nimputunnaayi..
kavitalayi kErintalu koDutunnaayi
ayidu aDugula adbhuta paalaraati Silpam
edurugaa unnaa.. aardhrata ninDina
pilupulu, aasaantam duusuku pOtunnaayi...
prati dhvani kOsam bhuvanabhOntaraaLaalu
veduku tunnaayi ..
aravai kEjiila niSSabdamai
venudirigi nilici vikkiristunnaayi..
hadduleragani aaraaTam
nOTikaDDamgaa pada maalikalallukuni
kavitala musugulo
suddha saavEri aalaapistundi
ayidaDugula Silpam kOsam kaadu
aravayi kEjiila niSSabdam kOsam kaadu
aardhrata ninDina pilupuku
aaSraya miccE manasu kOsamii aaraaTam..
civari varaku naa ee pOraaTam..
.
Chaala baavundi.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteకాలం పెట్టే కేకలు కావవి
ReplyDeleteజార విడుచుకున్న జ్ఞాపకాలు
కవితల కేరింతలు కావవి
చేజార్చుకున్న మధుర క్షణాలు
ఐనా .......
అలసిన నీ పిలుపుకు
చెమర్చిన నా హృదయం
పలుకుతోంది ఆహ్వానం
పాడుతోంది స్వాగత గీతం !!
*తప్పులుంటే మన్నించీ ...... ఒప్పులుగా భావించక
సరిదిద్దండి గురువుగారూ !
ఆర్ధ్రత నిండిన పిలుపుకు
ReplyDeleteఆశ్రయ మిచ్చే మనసు కోసమీ ఆరాటం..
చివరి వరకు నా ఈ పోరాటం..
ఆత్రేయ గారు అదరగోట్టారు... :)
ఇక ఈ సమరం నేగరుపను, అందుకే ఓటమినే గెలుపుగ సంధికొచ్చేసా.
ReplyDeleteనా కోసం కవితలల్లి, నా కన్నీట నీవూ కరిగి,
నీ బాణిలో కథలల్లి, నా నవ్వులో నీవూ కలిసి,
నా కవితకి స్ఫూర్తివై, నా అనుభూతిలో నీవూ తడిసి,
నీ వాణిలో తేనెలునింపి, నా బాధలో నీవూ గడిపి,
నా తోడువై మెసిలి, నా నిట్టూర్పులో నీవూ ఎగిసి,
నీ కౌగిలితో కమ్మేసి, నా వొడి నీవూ దోచేసి,
నా ఉనికి నాకిక వద్దని, నీ వినా నే మనలేననిపించిన నా ఆత్మబంధువా,
నీ నా బేధమిక లేనేలేదని మనవైక్యమైన ఆత్మలని నేడు చూపవా?
ఆత్మసంగమం అయిన అస్థిత్వంలో మన కలయిక అనివార్యమని, ప్రియా,
ఆ పడుగుపేకల మధురిమల మేళవింపే నాకు నీవిచ్చే కానుకని నిరూపించవా?
పూల గుబాళింపుల నడుమ నించుని ఆస్వాదిస్తునట్టుంది. అభినందనలు.
ReplyDeleteపృధ్వీ గారు ధన్యవాదాలు.
ReplyDeleteపిచ్చబ్బాయి మళ్ళీ కామెంటు తేసేశావా ? నువ్వంతే !! మీరు చెప్పింది నిజమే అక్కడ భూనభోంతరాళాలు అన్న పదమే సరి అయినది. మార్చాను. తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు.
పరిమళం స్వాగతించినందుకు ధన్యవాదాలు. నిండుమనసు పిలుపులలో తప్పులుండవు. మీ కొనసాగింపు చాలా బాగుంది.
చింతకాయల 'కవి' గారు నాబ్లాగుకు స్వాగతం. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ఉష గారు మీ స్పందనకు నాకు మాటల్లేవు. వంశీ (kRsNa ) చెపినట్టు. నేను ఒక మొక్క నాటితే దానికి ఇలా ఎన్ని పూలు పూశాయో చూడండి. మనసారా ఆశ్రయమిస్తూ ఒక పువ్వు, మకరందాలొలుకుతూ మరోపువ్వు పూసి, నా బ్లాగును నందనవనం చేస్తున్నాయి. ధన్యవాదాలు.
వంశీ, ధన్యవాదాలు.
అయ్యో ఆత్రేయ గారూ, అదేం కాదండీ.... అంత మంచి కవితల్లో తప్పు ఉండటం ఎందుకు.. అది లేకపోతే ఇంకా మంచిది కదా అని మీకు చెప్పాను. మీరు చూసుకొనేశారు చాలు. అక్కడ ఆ వ్యాఖ్య ఇక అవసరం లేదనిపించింది. తీసేశాను అంతే. :-)
ReplyDelete