ఎన్నాళ్ళీ వెదుకులాట ఎన్నేళ్ళీ విరహ బాధ
ఆ మనిషిక దొరికేనా.. ఈ బ్రతుకిక పండేనా
మౌన వృక్షానికి పూసిన
భావ కుసుమ పరిమళాలు ఆఘ్రాణిస్తూ..
జ్ఞాపకాల గాలి వానలొ
కళ్ళ కిటికీ తుంపరలను ఆస్వాదిస్తూ... !! ఎన్నాళ్ళీ
కరిగే కాలం ఈ కళ్ళలో
దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..
మనసు కొలనులో ఇమడని
కలల నృత్యాల సోయగాలు తలుచుకుంటూ... !! ఎన్నాళ్ళీ
గుండె గోడల మధ్య
యదార్ధ అగాధాలను కొలుచుకుంటూ..
బ్రతుకు అంచుల మీద
ఆశ హంసల రధాన్ని నడుపుకుంటూ ... !! ఎన్నాళ్ళీ
====================================
ennaaLLii vedukulaaTa ennELLii viraha baadha
aa manishika dorikEnaa.. ii bratukika panDEnaa
mouna vRkshaaniki puusina
bhaava kusuma parimaLaalu aaghraaNistuu..
jnaapakaala gaali vaanalo
kaLLa kiTikii tumparalanu aasvaadistuu... !! ennaaLLii
karigE kaalam ii kaLLalO
daacina muLLa puulanErukunTuu..
manasu kolanulO imaDani
kalala nRtyaala sOyagaalu talucukunTuu... !! ennaaLLii
gunDe gODala madhya
yadaardha agaadhaalanu kolucukunTuu..
bratuku ancula miida
aaSa hamsala radhaanni naDupukunTuu ... !! ennaaLLii
మనోవేదన ఎంతోబాగుంది. భావోదృత భరితం. సూపర్...మాకు మాటలురావటంలేదు.
ReplyDeleteపూసేపూలు రాలవచ్చు వాడవచ్చు
మీ కవితలు అవిమోసే సుంగధాలు.
వెతికినా దొరకనిది వుండొచ్చు
అసలైన కవిత్వం దొరికేది మీ కవితల్లోనే..
ఇప్పుడున్నవిరహం రేపు వుండకపోవచ్చు
మీ కవితలపై ఇష్టత కలకాలం నిలిచివుంటుంది.
చాల బాగా రాసారు. ప్రతీ వాక్యంలో భావం ఉట్టిపడుతుంది. కాని ఇంత కన్న మంచివి మీ కలం నుండి వెలువడటం మేము చూసాము.
ReplyDeleteవర్మ గారు ధన్యవాదాలు. కుంచెతో కసరత్తులు చేయిస్తారు మీకు పోటీ ఎవరు?. నాలా కాస్తో కూస్తో కవిత్వం చెప్పగల వాళ్ళు చాలామంది ఉంటారు.
ReplyDeleteవంశీ, మనసులోని భావాన్ని నిర్బయంగా చెప్పినందుకు సంతోషం. ఇదికూడా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
భావాలని వ్యక్త పరచడంలో మీకు మీరే!!!!!
ReplyDeleteబ్యూటిఫుల్.....
ఈ సాహిత్యాన్ని వరించబోయే రాగమేమిటో?పాట అద్భుతం గా వుంది.
ReplyDeleteపద్మార్పిత గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. మీతో కలుపుకుని ఇక్కడ మహామహులున్నారు..ఆ వరసలో నేను చివ్వరివాడిని. అదిగో అక్కడ....చేతికర్ర పట్టుకుని చెట్టునీడన, గోలీసోడా తాగుతూ ఆయాసపడుతున్నాడే! భుజంమీద కండువాతో ముఖం తుడుచుకుంటున్నాడే ! అదినేనే !!
ReplyDeleteరాధిక గారు.. చాలా రోజులయింది మిమ్మల్ని ఇక్కడ చూసి. రాగాలలో ప్రవేశము ఉన్నవారెవరన్నా చెపుతారేమో చూద్దాము. అద్భుతం అన్నందుకు అబ్బో చెట్టెక్కేశా. మళ్ళి గోలీసోడా తాగాలి. :-)
ReplyDeleteతావెళ్ళాడని అనిపించిన దారుల గాలే పీల్చుతూ,
ReplyDeleteతన అడుగులుసోకాయన్న నేల తిరిగి తిరిగి తాకుతూ,
తన వూసే వూరూ వాడా చెప్తూ,
తను మెసిలిన లోగిలి వాకిటనే నిలుచుని,
తనొస్తే ఏంచెప్పాలో మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,
ఎన్నాళ్ళూ గడిపానిలా? ఏమో తాను తప్ప ఇంకేమీ జ్ఞప్తికే రావట్లేదు!
ఎన్నాళ్ళీ వెదుకులాట ఎన్నేళ్ళీ విరహ బాధ
ReplyDeleteఆ మనిషిక దొరికేనా.. ఈ బ్రతుకిక పండేనా
మౌన వృక్షానికి పూసిన
భావ కుసుమ పరిమళాలు ఆఘ్రాణిస్తూ..
జ్ఞాపకాల గాలి వానలొ
కళ్ళ కిటికీ తుంపరలను ఆస్వాదిస్తూ... !! ఎన్నాళ్ళీ
కరిగే కాలం ఈ కళ్ళలో
దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..
మనసు కొలనులో ఇమడని
కలల నృత్యాల సోయగాలు తలుచుకుంటూ... !! ఎన్నాళ్ళీ
గుండె గోడల మధ్య
యదార్ధ అగాధాలను కొలుచుకుంటూ..
బ్రతుకు అంచుల మీద
ఆశ హంసల రధాన్ని నడుపుకుంటూ
saar guruvu gaaru mee kavithalu chaala bavunnaayy meenunchi marinni manchi kavithalu koru kuntunnaamu
ఉష గారు మీ స్పందన అదుర్సు.. "ఏమో తాను తప్ప ఇంకేమీ జ్ఞప్తికే రావట్లేదు!" అద్భుతమయిన ముగింపు. బాగా నచ్చింది.
ReplyDeleteపవన్ కళ్యాణ్ గారు నా బ్లాగుకు వచ్చినందుకు ధన్యవాదాలు. రాస్తాను! మంచిదో కాదో మీరే చెప్పండి.