Monday, February 9, 2009

పాల మనసు

కలల సాగరాలన్నీ కలియ తిరిగి,
కంటి పల్లకీలో - రెప్పల రెక్కలార్చుకుంటూ,
చెక్కిళ్ళపై వాలిన ఆశ విహంగాలు,
అలిసి, పెదవి తెరల వెనక విశ్రమిస్తున్నాయి
ఒంటి కంటిన ఉప్పులు కడుక్కుంటున్నాయి
ఆ ఉప్పు తగిలిన పాల మనసు విరిగింది
ఆ శబ్దానికి అవి, తిరిగి పయన మయ్యాయి.. కవితలా !!

=======================


kalala saagaraalannii kaliya tirigi,
kanTi pallakiilO - reppala rekkalaarcukunTuu,
cekkiLLapai vaalina aaSa vihangaalu,
alisi, pedavi terala venaka viSramistunnaayi
onTi kanTina uppulu kaDukkunTunnaayi
aa uppu tagilina paala manasu virigindi
aa Sabdaaniki avi, tirigi payana mayyaayi kavitalaa

4 comments:

  1. ఏమండి..అవి అంటే అక్కడ కలలా? పాలమనసు అంతరార్దం నేను మీరీతిలో అర్థంచేసుకోలేకపోయా..కానీ ఒక క్షణంలో అందాన్ని చూసి విరిగిన పాలమనసు తో చక్కగా కళాత్మకంగా పోల్చిన దృశ్యం కనబరిచింది నాకు, చాలా చాలా చక్కగా వుంది. (చదివాక ఏమాత్రం టైటిల్ కుదరలేదనిపిస్తుంది. కవిత కొద్దిగా వున్నా కొండంత బావుంది. విమర్శనకు మన్నించగలరు, అనిపించింది చెప్పాను.)

    ReplyDelete
  2. తిరిగి పయన మయ్యాయి.. కవితలా !!
    nice. :)

    ReplyDelete
  3. వర్మ గారు ధన్యవాదాలు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే..నేను నా కన్నీళ్ళ గురించి చెప్పాను. అవి నా ఈ కవితకు ప్రేరణ అని చెప్పాను. మిగిలినవన్నీ ఉపమానాలు...

    ప్రేమికుడు గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  4. caala lOtu bhAvam. nEnu ardham chEsukolEkapOya. kshaminchanDi. :(

    ReplyDelete