నీకై నిండిన నా ప్రేమ -- అది విరగదు
నీ లేత పాదాలు కందక
నువు నిల్చున్నది నా అరచేతిలో -- అది కంపించదు
అవి తారలు కాదు రాలడానికి
నీకై నా నిండిన కనుదోయి -- అవి రాలవు
నిను తాకిన గాలులు.. చెలీ
నా శ్వాశలు .. అవి ఆగవు -- నీకై అవి ఆగవు
ఇక పిల్లలు పెద్దలు పావురాళ్ళంటావా
ఎవరి బ్రతుకు వారిది.
మన బ్రతుకులే ఒకరి కోసం ఒకరివి.. కాదంటావా ?
ముక్కలయిన నీ మనసు చూశావు గానీ
నిండిన కన్నులతో వాటినేరుకుంటున్న
నన్నెలా చూడలేదు ?
నీ గుండె నాకెప్పుడో ఇచ్చావుగా..
ఆ పగిలిన శబ్దం నీ గుండెది కాదు చెలీ
వెను తిరిగి అది నీకు చూపలేకే
ఈ నా పరుగు.. నీ నుండి దూరంగా
నీ మనసు ముక్కలు పొదువుకుంటూ
నా గుండె బీటలు కుట్టుకుంటూ..
మీరంతా ఇలా కవితా భాషలో ముచ్చటించుకోవడం బహు ముచ్చటగా ఉంటుంది :)
ReplyDeleteపరిమళం గారి కవితకి మీ ప్రతిస్పందన అద్భుతం.
అసలు మీకు అంత వేగంగా క్షణాల మీద కవిత్వం ఎలా వస్తుందండీ బాబూ..? మొత్తానికి సరస్వతీ కటాక్ష సిద్ధి ఉన్నట్టుంది మీకు. ఇంకా కొన్ని వేల, లక్షల కవితలు మీరు రాయాలని.. ఆత్రేయ గారంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను :)
మధుర వాణి ! సార్ధక నామ దేయులన్న మాట. వాణీ కటాక్షం అభిలషనీయమే. మీ అభిమానానికి శతకోటి ధన్యవాదాలు.
ReplyDeleteచదివాక నిర్లక్ష్యం చేయకుండా కామెంటాలనిపించింది. చాలా బాగుంది. ఐతే ఇలాంటివి రాసి మీరు చాలా రోజులైంది కదా.
ReplyDeleteగురువు గారూ !ధన్యోస్మి !!
ReplyDelete