నీడలా నాతోనే ఉంటూ గాధలన్నీ వింటుంది
నాతో కలిసి గతాన్ని తోడుతుంది
పరిచి నిస్పృహల్లో ఆరేస్తుంది
గడిచే కాలాన్ని విడిచే నిట్టూర్పులనీ
నాతో సమంగా అనుభవిస్తుంది.
నిండిన కళ్ళతో మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది విశ్రాంతినిస్తుంది
విడిన బంధాలని, విగత భావాలని
వక్రించిన విధి విధానాన్ని
నాకై విశ్లేషిస్తుంది ఊరటనిస్తుంది
అర్ధం కాని బ్రతుకు నిజాల్ని
ప్రతిధ్వనించే మౌన గీతాల్ని
తిరిగి ప్రశ్నిచే ఆవేదన క్షణాల్ని
ఆకళింపు చేస్తుంది, ఒద్దన్నా
మరోసారి అనుభంవంలోకి తెస్తుంది.
ఆశ దీపానికి చేతులడ్డు పెట్టి
ఆవలి తీరం చూపిస్తుంది
నా చీకట్లు తనలో ఇముడ్చుకుంటుంది
ఒకోసారి నా అస్థిత్వమే తనవుతుంది
ఈరోజెందుకో, కోరిచేరిన తను
కసిరి జారిపోయింది, గాయపడ్డట్టుంది,
తనకంటూ ఒక గుర్తింపు కోరినట్టుంది
గోడమీద తన నీడకోసం
ఆప్యాయంగా తడుముకుంటుంది
తనులేని నేను నాకేమవ్వను?
నేనుకాని నేను తనకేమవ్వను ?
పాపం నా ఏకాంతం. ఈరోజు ఒంటరయ్యింది.
niiDalaa naatOnE unTuu gaadhalannii vinTundi
naatO kalisi gataanni tODutundi
parici nispRhallO aarEstundi
gaDicE kaalaanni viDicE niTTuurpulanii
naatO samamgaa anubhavistundi.
ninDina kaLLatO masakabaarina naa prastutaanni
viDamarici viSadiikaristundi viSraantinistundi
viDina bandhaalani, vigata bhaavaalani
vakrincina vidhi vidhaanaanni
naakai viSlEshistundi uuraTanistundi
ardham kaani bratuku nijaalni
pratidhvanincE mouna giitaalni
tirigi praSnicE aavEdana kshaNaalni
aakaLimpu cEstundi, oddannaa
marOsaari anubhamvamlOki testundi.
aaSa diipaaniki cEtulaDDu peTTi
aavali tiiram cuupistundi
naa ciikaTlu tanalO imuDcukunTundi
okOsaari naa asthitvamE tanavutundi
iirOjendukO, kOricErina tanu
kasiri jaaripOyindi, gaayapaDDaTTundi,
tanakanTuu oka gurtimpu kOrinaTTundi
gODamiida tana niiDakOsam
aapyaayamgaa taDumukunTundi
tanulEni nEnu naakEmavvanu?
nEnukaani nEnu tanakEmavvanu ?
paapam naa Ekaantam. iirOju onTarayyindi.
మీ కవితలకు ముగ్దుడను. కవితల్లోని వివరణ బావం నన్ను కట్టి పడెస్తున్నాయి. విషయాలు తెలిసొస్తున్నాయి..మీకు మరొక్క సారి ధన్యవాదములు.
ReplyDeleteబాగుందండి మీ కవిత.
ReplyDeletebagundi,
ReplyDeletevahvaa..........
అంటే నీకో జంట దొరికిందని అన్యాపదేశంగా తనకు తెలిపావు కదా మిత్రమా! అందుకే నను వెదుకుతూ ఇటు వచ్చింది, అనుకోని ఆ అతిథిని అంతే సాదరంగా నా సన్నిధికి ఆహ్వానించాను. నాకు తోడు దొరికితే దానికొక నేనే ఒక నెలవు వెదికి పెడతా, ఇక నీవు జాగరూకుడవై తిరిగి ఒంటరి రాక్షసి పాలబడి పిచ్చితల్లి ఏకాంతాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకు. సరదాగానే సుమండీ, మీకు అన్ని హక్కులూ వున్నాయీ వ్యాఖ్య తొలిగించను.
ReplyDeleteవర్మ గార్కి, సాయికిరణ్ గార్కి ధన్యవాదాలు.
ReplyDeleteసుభద్ర గారికి నా బ్లాగుకు సాదర స్వాగతం.
ఉష గారు పట్టేశారు. మీరు అఖండులు సుమా!! మీరు చాలా సీరియస్సు గా రాశారనుకున్నా సరదాగా అనిచెప్పి తుస్సుమనిపించారు. మీ స్పందన చాలా బాగుంది. ధన్యవాదాలు
కవిత అప్పుడే అయిపోయిందా!!
ReplyDeleteOke maataa.. Adbhutam.. mee abhimaani Siva Cheruvu
ReplyDeleteవంశీ, శివ గార్లకు వారు చూపే అభిమానానికి ధన్యవాదాలు. తరచు ఇటు వస్తూ ఉండండి,
ReplyDelete