Tuesday, February 3, 2009

నీ ప్రేమకై ...

నీ ఊహల నీడల మాటున
ఆ ఊసులు కూర్చిన స్వరమున
నా రోదన గాధను పాటగ
నీ తోడు కోరకై పాడనా

నీ జ్ఞాపకాల కలము చేసిన
గుండె గాయము మానునా
నీ తోడు కోసం మనసు పెట్టిన
ఈ రుధిర ధారలు ఆగునా !! ... నీ ఊహల

నా పాట ఈరోజు సావేరిగా సాగె
నీకోసమర్ధించు వరాళి గా మారే
నా ప్రేమ పైనీకు కినుకెందుకే దేవి
వ్యధనుండి నాకింక ముక్తెప్పుడే దేవి !! .. నీ ఊహల

nii uuhala niiDala maaTuna
aa uusulu kuurcina svaramuna
naa rOdana gaadhanu paaTaga
nii tODu kOrakai paaDanaa

nii jnaapakaala kalamu cEsina
gunDe gaayamu maanunaa
nii tODu kOsam manasu peTTina
ii rudhira dhaaralu aagunaa !! ... nii uuhala

naa paaTa iirOju saavErigaa saage
niikOsamardhincu varaaLi gaa maarE
naa prEma painiiku kinukendukE dEvi
vyadhanunDi naakinka mukteppuDE dEvi !! .. nii ఉఉహాల

http://pruthviart.blogspot.com/2009/02/blog-post_6518.html కు నా స్పందన

4 comments:

  1. Beautiful....చాల బాగుంది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. పాటగా రాసారు. ఆర్తిగా పిలుస్తున్నారు. ఎవరికోసమో ఈ తపన.

    ReplyDelete
  4. వంశీ, పాట్లు చెప్పి చూశా, ఫోను తిప్పి చూశా, పాటపాడి చూశా, బాగ పొగిడి చూశా, వచ్చే వాళ్ళయితే ఈపాటికి ఎప్పుడో వచ్చేవాళ్ళు.
    అప్పుడు పొమ్మన్నా ఫో ఫో పొమ్మన్నా అని పాటలు రాశే వాడినేమో అది తరవాత విషయం. అది కధ.

    శృతి ఏమయ్యిన్ది పోస్టు డిలిట్ చేశావు ? నచ్చదనా ? నీకు నచ్చకా ? అలాంటివి పెట్టుకోకు. పిల్లకాయలు ఏమి చెప్పినా బానేఉంటుంది. మొత్తానికి నా బ్లాగులోకొచ్చి దొంగలాగా, చప్పుడు చేయకుండా వెళ్ళావు, నీకాలి గుర్తులు ఇక్కడే ఉన్నాయి. దొంగదొరికిందిలే !!

    పద్మార్పిత గారికి ధన్యవాదాలు

    ReplyDelete