Monday, January 12, 2009

తెలుగు కందం ఆంగ్లానికద్దితే ?

తెలుగు కందం ఆంగ్లానికద్దితే
అంతే అందం అబ్బుతుందోచ్‌ !!!

మాన్యులు తప్పులుంటే మన్నించగలరు,

కం:
ఫర్‌ సింపుల్‌ హాపీనెస్‌
బి ఇట్‌ యువర్స్‌ ఆర్‌ అథర్స్‌ డుగుడ్‌ ఓన్లీ
థిస్‌ సింపుల్‌ ఏక్ట్‌ విల్‌
డెఫినెట్‌లీ చేంజి వరల్డ్‌ ఫర్‌ గుడ్‌ స్లోలీ !!

for simple happyness
be it yours or others do good only
this simple act will
definitely change world for good slowly


ఇది ఏ పద్యమో తెలీదు కానీ
ఫ్లోలో వస్తే రాసి సద్దుకుపోయా

కందంబబ్బెను నాకని
అందంగా మాట చెప్ప ఆంగ్లము నైనన్‌
పొందిగ్గా రాయగల్గితి
చిందుల్నిక వేసినాను నైబర్లు అర్వన్‌6 comments:

 1. మనోహర్ గారు నా బ్లాగుకు స్వాగతమండి. ధన్యవాదాలు

  ReplyDelete
 2. మరి కొన్ని ఇంగ్లీషు కందాలు ఇక్కడ రిలవెంట్ గా వుంటుందని అంతర్జాలం నుండి గ్రహించి ఇక్కడ వ్రాస్తున్నాను.
  1.Why you want to have trick
  Poetry fun when all the beauty of a
  Poem lies in gentle
  Doing that has nothing to do with gimmicks!

  2.Why don't you write free verse?
  Why do you rough the Telugu poetic beauty?
  I don't like this ati-
  tude; English can't be used in this mean way!

  ReplyDelete
 3. ఈ"ప్రయోగం" నిజంగా అవసరమా!

  ReplyDelete
 4. సర్వ శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్, కత్తి మహేష్ మీరు ఇటు వచ్చి నందుకు ధన్యవాదాలు. మీ విమర్శలు శిరోధార్యాలు అదేనండి,
  మీ అక్షింతలు నా తలపై ఇంకా నిలిచే ఉన్నాయి.
  కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత.
  నేనిప్పుడే చందస్సు గురించి తెలుసుకుంటున్నాను (ఈ వయస్సులోనా అని ఆశ్చర్య పోకండి).
  కొత్త శబ్దం కనిపెట్టిన పిల్లాడు, అదేపనిగా దాన్నే వాడినట్టు ఉంది నా ఈ ప్రయోగం.
  పిల్లగాళ్ళకి గిమ్మిక్కులంటేనే మంచి ఆసక్తి. నాదీ ప్రస్తుతానికి అదే ధోరణి.
  ప్రతి భావం కందంలో కనపడుతుంది. ఇందుగలడందులేడని సందేహము వలదన్నట్టు.
  నిజమే పెద్దలు మీరు, నావి కుప్పిగంతులని పించచ్చు, అవి కుప్పిగంతులేమో కూడా నాకు ప్రస్తుతం తెలియదు ఇంకా నేర్చుకోవాల్సినది ఉంది కనక.
  మీ మాటలను నేను ప్రోత్సాహంగానే తీసుకుంటున్నాను.
  ఏభాషనూ కించపరిచే ఉద్దేశ్యము నాలేదు. దేని అందం దానిదే.

  ఎంతయినా కొత్త ఆవకాయ మంట నషాళానికి అంటితేనే పాతదాని పులుపు తెలిసేది.
  మీ ఇద్దరికీ మరోసారి ధన్యవాదాలు. నా ఇతర అచ్చతెలుగు (అయ్యో కొన్ని హైబ్రీడు కూడా ఉన్నాయి లేండి.. మళ్ళీ మీ అక్షింతలకు నా తల రెడీ) రాతలపై కూడా మీ అమూల్యమయిన అభిప్రాయాలను తెలుపగలరు.

  ReplyDelete
 5. ఆత్రేయ గారూ, మీ ప్రయోగం వల్ల తెలుగు భాష కి ప్రమాదం వాటిల్లదని నా అభిప్రాయం. వస్తే, గిస్తే ఆంగ్లానికే వస్తుంది. మీరు ఆంగ్ల కవులని మన ఛందస్సు వైపుకి లాగేయండి మరి.

  @మహేష్ గారూ, భీష్ముడి గురించి, మహా భారతం గురించి వ్రాయడం అవసరమా??? దాని వల్ల ఎవరికీ ప్రమాదం లేదు అలాదే దీని వల్ల కుడా ప్రమాదం ఏం లేదు కదా. ఉపయోగం కొంచెం ఉండచ్చు. ఉపయోగం ఏంటి అని అడగొద్దండి. త్వరలో మీరే చూస్తారు

  ReplyDelete