Friday, January 30, 2009

కన్నీళ్ళు

కలగంటున్న యెదగల హితుడవు
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి

హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి

ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి నేర్పెను నాకో పాఠం

ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి

నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు

http://pruthviart.blogspot.com/2009/01/blog-post_29.html కు నా స్పందన.

2 comments:

  1. ఒక కలం గళంవిప్పితే ఇలాగేవుంటుందని తెలిసివచ్చింది. కవితావిషయం బహిర్గతమొనర్చిన తీరు అభినందనీయం.
    బొమ్మకు భాష్యం చెప్పే నేర్పరితనం అభిలషణీయం. ఏమైనా మీకుమీరేసాటి.

    ReplyDelete
  2. పృధ్వీ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. బొమ్మలో పలుభావాలు రేకిత్తిస్తున్నది మీరు. నేను కేవలం స్పందిస్తున్నాను అంతే.

    ReplyDelete