వెదురు గుండెకు గాయం చేసి వేణువులా మోగ మనే
తిరిగి బ్రతికిన జ్ఞాపకానికి ఏమని చెప్పను
గుండె గుంటలో బండను తోసి అలల కోసం
కలల కొమ్మపై కాపేసిన కాలానికి ఏమని చెప్పను
గుండె మంటలొ గతాన్ని పోసి రగిలే సెగలో చలికాచుకునే
విగత క్షణాలకు ఏమని చెప్పను
విధి గీసిన చీకటి దారుల్లో వేదన మంటలే ఆశ్రయమిస్తే
అవీ ఆర్పిన కంటి జల్లులకేమని చెప్పను
గుండె మంటలొ గతాన్ని పోసి రగిలే సెగలో చలికాచుకునే
ReplyDeleteవిగత క్షణాలకు ఏమని చెప్పను
adbutamaina expression
ఆత్రేయగారూ నమస్కారమండీ...:) మీ కవితలు అద్భుతంగా ఉంటున్నాయి.
ReplyDeleteమనసు మాటున దాగిన మాటలను పాటగ
పాడగల మీ ప్రతిభను ఏమని పొగడ గలను..?
బొల్లోజు బాబా గారు చెప్పినట్లు లోతైన భావాలు. కవితలో వేదన బాగున్నా ఇంతగా ఆవేదన పడటం చిత్రమే..full Expression!!
ReplyDeleteబాబా గారికి, ప్రేమికుడు గారికి, పృధ్వీ గారికి ధన్యవాదాలు
ReplyDelete