Wednesday, January 21, 2009

జ్ఞాపకం

నా గారాల పట్టి ఈరోజు ఎందుకో
గతంలో నుండి దోబూచు లాడుతుంది
కలల బంధనాలు తెంచుకుని
కవ్విస్తూ వాస్తవంలో తిరుగాడుతుంది
పట్టి బంధించలేని నిస్సహాయత
తన వెనకనే తిరుగుతూ వెక్కిరిస్తుంది

తను అందంగా ఆనందంగా తిరిగుతూ నవ్వించినా కవ్వించినా
అది నిజం కాదన్న నిజం ఆశ దీపాన్ని ఆర్పేందుకు చూసే చిరుగాలిలా
చెంపలని తడుతుంది చెమ్మ ముసుగు తనని తిరిగి దాచేస్తుంది

రంగుల అబద్ధాల గదుల్లో నేను కొట్టిన కేరింతలు
నిజం తెరలు తగిలి కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి,
గుండె గోడల్లో లయలుగా ఇరుక్కుపోతున్నాయి

ఎందుకో ఈరోజు నా చిన్నారి గతం తలుపులు తీసి
మనసు ముంగిట్లో కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది

తిరిగి తెరలవెనక ఆమె మాయమవుతుంది
అబద్దంగానైనా ఆశ ఆనందంగా ఆవులిస్తుంది
ఆదమరుస్తుంది

5 comments:

  1. ఆత్రేయ గారూ, మీరు చెప్పిన "గారాల పట్టి" మనిషా లేక మీ గత స్మృతులా.. ?
    అర్భకుడు వీడు, అర్థం కాక అడిగాడు. నవ్వొస్తే నవ్వుకోండి, కోపమొస్తే తిట్టుకోండి, నా బుర్ర కు అర్థమయ్యేలా చెప్పండి

    ReplyDelete
  2. స్మృతులే !! భలేవారే నాకు దేనికీ కోపం రాదండి. నవ్వొచ్చేటంత కితకితల ప్రశ్నకూడా మీరు వెయ్యలేదు. మన ఆలోచనలలోకి అందని మనుషులనే ఈ జనం పిచ్చోడంటారు నేను వాళ్ళలో ఒకడినీ కాదు. మీకు ఇప్పుడు అర్ధమయిందనుకుంటాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఆత్రేయగారు..... మీ ఙ్జాపకాలు కూడా ఆలోచనలని రేకెత్తిస్తాయండి.

    ReplyDelete
  4. అబ్బా.. ఎంత బాగా రాసారండీ..!
    మీకు అభినందనలు.

    ReplyDelete
  5. పద్మార్పిత గారు, మధురవాణి గార్లకు ధన్యవాదాలు.

    ReplyDelete