Thursday, January 22, 2009

వేచి చూద్దాం - ఓబామా

తుస్సు మన్న బుస్సు బాంబు
పచ్చడైన పచ్చ నోటు
బీటలడ్డ కోట గోడ
భగ్గు మన్న ఆశ గడ్డ

ఓటు పోటు ఓడ పైన
మార్పు మాట లంగరేసి
తెల్ల కోట బుర్జు పైన
నల్ల రాజు ఎక్కె నేడు

నల్ల రాజో తెల్ల రాజో
రాజు కేమి లోటు రాదు
వారి ఆట లోన మంట
పేద జనం డొక్క కేగ

మార్పు మాయ నిజం ఐతే
అంత కన్న భాగ్య మేమి
కొంత కాలం వేచి చూస్తే
దాని భోగం వ్యక్త మౌలే

జారు కాలం చెప్ప బోదా
కొండ దూరం తగ్గ బోదా
ఉన్న సున్నం రాలు తుందో
లంకె బిందై పొర్లు తుందో

3 comments:

  1. కవిత చదివాక మున్ముందు ఇంకా మీ కవితలు చదవాలని ఆత్రుత పెరుగుతోంది. Nice one....

    ReplyDelete
  2. హహ చాలా బాగుంది.
    నేను ఒకప్పుడు ఇలాంటిదే వ్రాసాను కానీ, నాది కొద్దిగా ఆవేశ పూరితంగా తయారైంది. సరళత్వం అంత సరళంగా రాదు కవితల్లోనికి అని తెలుసుకున్నాను.

    ReplyDelete
  3. పద్మార్పిత గారు ధన్యవాదాలు.
    రాకేశ్వర రావు గారు నా బ్లాగుకు స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete