Sunday, January 18, 2009

కొండ చెట్టు కొమ్మ మీద

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

ఘల్లు మన్న గజ్జెలాగ బోసి పాప నవ్వులాగ
రెల్లు గూటి పడవలాగ అలల మీద ఊగి సాగి
గంతులేసి గుండె అలసి వీడి పోకు ఆగమంది !! కొండ..

తావి గాలి తనువు తాకి డొలికల్లో నన్ను ముంచి
కాంతి కన్ను మూయగానే వీడి పోవు నీడలాగ
నాకు ఏమి కానట్టు జారిపోయె ఈడులాగ !! కొండ..

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

3 comments:

  1. కొండగాలి పిలిచింది...
    గుండె ఊసులాడింది...
    మీ కవిత నాకు నచ్చింది...

    ReplyDelete
  2. పద్మార్పిత గారు మంచి పాట గుర్తుచేశారు. ధన్యవాదాలు.
    నేస్తం మీకు కూడ ధన్యవాదాలు.

    ReplyDelete